google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: వర్మ కోసం నాగ్, రాజమౌళి రీట్వీట్!

8, నవంబర్ 2016, మంగళవారం

వర్మ కోసం నాగ్, రాజమౌళి రీట్వీట్!




రూ. 340 కోట్ల బడ్జెట్‌తో 'న్యూక్లియర్‌' అనే అంతర్జాతీయ చిత్రాన్ని ఆయన తెరకెక్కించబోతున్నట్లు వర్మ  ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ట్విటర్‌లో .. 'ఆర్‌జీవీ బ్యాక్‌ విత్‌ బ్యాంగ్‌..? నిజంగా' అని జక్కన్న ట్విట్‌ చేశారు. దీనికి వర్మ 'సర్‌.. ఒకరోజు రాత్రి మీతో ఫోన్‌లో మాట్లాడుతూ బాహుబలి నుంచి నేను పొందిన స్ఫూర్తి గురించి చెప్పాను. కచ్చితంగా బాహుబలి బ్యాంగ్ ఔట్ అని అనాడు నేనే చెప్పింది నేడు నిజమైందని  ట్వీట్‌ చేశాడు.

వర్మ 'న్యూక్లియర్‌' గురించి అక్కినేని నాగార్జున కూడా స్పందించారు. 'రామ్ గోపాల్ వర్మ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. మనమంతా గర్వపడేలా వర్మ ఆ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తారని '  ట్వీట్ చేసారు. నాగ్ కి వర్మ రిప్లై ఇస్తూ 'హే నాగ్...అప్పట్లో నేను కొత్తవాడిని అయినా నాపై నమ్మకంతో శివ సినిమా చేసే అవకాశం ఇచ్చావు. నీకు 10 జన్మల పాటు రుణపడి ఉంటాను'... అన్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి