'చనిపోయేవరకు నటిస్తూనే ఉంటా., దీనికి అంగీకరించిన వాడితోనే పెళ్లిపీటలు ఎక్కుతాన’ని నటి త్రిష తెగేసి చెప్పింది.
దాదాపు దశాబ్దంపాటు తమిళంలో, ఇటు తెలుగులోనూ మంచి పొజిషన్ లోనే హీరోయిన్‌గా కెరీర్‌ను కొనసాగించిన త్రిష, ఓ దశలో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామనుకుంది. కారణం తెలియదుగానీ ఓ వ్యాపారవేత్తతో జరిగిన నిశ్చితార్థం పెళ్ళి వరకు వెళ్ళకుండానే ఆగిపొయింది.
కానీ పెళ్ళి ఆగిపోవడానికి గల కారణం త్రిష మాటల్లోనే నిన్న బయటకొచ్చింది.
ఓ మీడియా కార్యక్రమంలో త్రిష తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘నేను నటించడానికి ఒప్పుకోనందుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా. ఒక వేళ నేను నేను ప్రెగ్నెంట్ అయినపుడు కూడా కొన్ని నెలల గ్యాప్ మాత్రమే తీసుకుంటాను., హీరోయిన్ వేషాలు రాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానైనా కొనసాగుతాను. దీనికి ఒప్పుకోనందుకే ఆ వ్యక్తితో తెగదెంపులు చేసుకున్నాను. చనిపోయేవరకు నటిస్తూనే ఉంటా. దీనికి అంగీకరించినవాడితోనే పెళ్లిపీటలు ఎక్కుతాన’ని చెప్పింది.
ఐనా నువ్వు చనిపోయేవరకూ సినిమా అవకాశాలు వస్తాయంటావా అమ్మడూ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి