ఈమధ్య చైనా వస్తువులకు వ్యతిరేఖంగా సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం మంచి ప్రభావాన్నే చూపినట్టుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో చైనా వస్తువుల అమ్మకాలు 60 శాతం వరకు పడిపోయినట్టు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సిఎఐటి) తెలిపింది. సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగిన ఈ ప్రచారంతో వినియోగదారులతోపాటు, వ్యాపారులు కూడా చైనా వస్తువులు అమ్మేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు.
ముఖ్యంగా దీపాళి టపాకాయలపై ఈ ప్రభావం కాస్త ఎక్కువగా పడినట్టు తెలుస్తోంది. వ్యాపారులు తమ షాపుల్లో చైనా వస్తువులు ప్రదర్శించేందుకు ఆసక్తి చూపకుండా.. ఖాతాదారులను ఆకర్షించేందుకు మా షాపులో భారతలో తయారైన వస్తువులే అమ్ముతాం’ అని మరీ బోర్డులు కూడా పెట్టారు.
ఈ దీపావళికి వినియోగదారులు కూడా చైనా వస్తువులకు బదులు స్థానికంగా తయారైన మట్టి ప్రమిదలు, ప్లాస్టిక్‌తో తయారు చేసిన అలంకరణ వస్తువులతో తమ గృహాలను అలంకరించుకున్నారు.
చైనా నుంచి దిగుమతయ్యే దీపావళి టపాసులు, పండగ అలంకరణ వస్తువుల విలువ 10 లక్షల డాలర్ల వరకు వుంటుంది. సామాజికమాధ్యమాల ప్రచారం చైనా టపాకాయల బిజినెస్ ను దాదాపుగా తుస్స్ మనేలా చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి