గత కొద్ది రోజులుగా షిర్డీ సాయిబాబాపై వివాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ద్వారకా పీఠాధిపతి స్వరూపానందకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్ ఇచ్చింది. ఇకపై సాయిబాబాపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయవద్దని ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది.
సాయిబాబాను కించపరిచే విధంగా స్వరూపానంద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్ షిర్డీ సాయిబాబా ట్రస్టు కోర్టుకెక్కింది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి