ప్రత్యేక హోదా అంశం ఇక చెల్లని నోటుతో సమానమని వ్యాఖ్యానించిన కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ తీవ్రంగా ఖండించాడు.
ప్రత్యేక హోదా చెల్లని నోటు కాదని, సుజనా చౌదరే చెల్లని కేంద్రమంత్రి అని విమర్శించాడు.
బుధవారం రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బ్యాంకులను మోసం చేసి వేలకోట్లు సంపాదించిన ఘనత సుజనా చౌదరిదని అన్నాడు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో హోదాను సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశాడు.
ప్రత్యేకహోదా విషయంలో సుజనా తన నోరును అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రమేష్ సూచించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి