google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఎయిమ్స్‌లో సుష్మాస్వరాజ్‌

16, నవంబర్ 2016, బుధవారం

ఎయిమ్స్‌లో సుష్మాస్వరాజ్‌




కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య కారణంగా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఎయిమ్స్‌లో చేరారు.

ఆసుపత్రిలో చేరానని, డయాలసిస్‌ ట్రీట్‌మెంట్ జరుగుతోందని ఆమె స్వయంగా తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేసారు.

సుష్మ కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఎయిమ్స్ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.

 కాగా, ప్రస్తుతం సుష్మాస్వారాజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చాలా రోజులుగా మధుమేహం ఉండటంతో ఆ ప్రభావం కిడ్నీ పనితీరుపై పడిందని, డయాలసిస్ జరుగుతోందని ఎయిమ్స్ వర్గాల తెలియజేసాయి.

సుష్మ గత 20 ఏళ్లుగా డబాబెటిస్‌తో బాధపడుతున్నారు. గతంలో ఆమె న్యుమోనియా, ఇతర ఆరోగ్య సమస్యలతో ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి