విశాఖపట్నం బీచ్ లో లవ్ ఫెస్ట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడంలేదని పర్యాటక, పురపాలకశాఖలు సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలియజేశాయి.
అలాంటి వార్తలను నమ్మొద్దని, అవి వదంతులేనని, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో ప్రైవేట్ ఉత్సవాలను నిర్వహించేందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని పేర్కొన్నాయి.
ఐతే, ఫిబ్రవరిలో విశాఖ తీరంలో వేడుకలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఓ ప్రైవేట్ ఏజెన్సీ సంప్రదించిన మాట వాస్తవమేనని తెలిపాయి. అయితే కార్యక్రమ నిర్వహణపై విశాఖ కలెక్టర్, వుడా వైస్ చైర్మన్, మున్సిపల్‌శాఖ కమిషనర్, టూరిజంశాఖ కమిషనర్‌తో కమిటీని నియమించినట్లు వెల్లడించాయి.
గత కొద్దిరోజులుగా.. తెలుగు సంస్కృతి-సంప్రదాయాలను ప్రభుత్వం మంటగలుపుతోందని, విదేశీ సంస్కృతిని తీసుకొస్తున్నారని.. ప్రతిపక్షాలు, కొన్ని స్వచ్చంద సంస్థలు విమర్శించడంతో..ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసినట్టు తెలుస్తోంది.
సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలకు భంగం కలిగించే ఎటువంటి ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి