google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: మంత్రి గారి కళాపోషణ!!

11, నవంబర్ 2016, శుక్రవారం

మంత్రి గారి కళాపోషణ!!




కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన టిప్పు జయంతి ఉత్సవాల్లో ఓ మంత్రి  తన మొబైల్ లో అశ్లీల చిత్రాలను చూస్తూ మీడియా కెమెరాకు చిక్కాడు.

యచూరు జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో విద్యా శాఖ మంత్రి తన్వీర్‌సేఠ్‌  వేదికపైౖనే కూర్చుని తాపీగా ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూస్తుండగా ఓ విలేకరి దానిని చిత్రీకరించాడు.

ఇది టీవి ఛానెళ్లలో ప్రసారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దుమారం చెలరేగింది. మంత్రి తన్వీర్‌ తీరుపైౖ  మండిపడ్డ ప్రతిపక్షనేతలు ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా తన్వీర్‌సేఠ్‌ సాయుంత్రం మీడియాకు వివరణ ఇచ్చారు. తాను మొుుబైల్‌లో అశ్లీల చిత్రాలు చూడలేదని, వేరే సమాూచారం కోసం మొబైల్ చూస్తుండగా లింక్‌ మారి ఆ చిత్రాలు వచ్చాయని తెలిపాడు.

అసలే అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్స్ గా మారుతున్న కర్ణాటకలో అధికారంలో వున్న నాయకులే ఇలాంటి నిర్వాహకాలకి పాల్పడుతుంటే..సామాన్య ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి