తాజాగా రణ్‌బీర్ కపూర్‌తో ‘యేదిల్‌హైముష్కిల్’ సినిమాలో ఐశ్వర్యారాయ్ నటించిన హాట్ సీన్ల వల్ల.. ప్రేక్షకుల్లో సెన్షేషన్ క్రియేట్ కావడంతో పాటుగా.. బచ్చన్ ఫామిలీలో గొడవలు, మన్స్పర్థలు మొదలయ్యాయని, ఈ చిత్రం కారణంగానే అభిషేక్-ఐష్ విడాకులు తీసుకోనున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి.
ఈ వార్తలపై ఇప్పటి వరకు మౌనం పాటించిన ఈ జంట, దీపావళి సందర్భంగా ఇచ్చిన పార్టీలో వాటికి తమ లిప్ కిస్ తో విమర్శకులికి షాక్ ఇచ్చే సమాధానం చెప్పారు.
ఐష్ అభిషేక్ లు అతిదుల మధ్య బహిరంగంగా ముద్దు పెట్టుకుని, తమ మధ్య ఎలాంటి గొడవా లేదని తేల్చిచెప్పారు.
ముంబైలోని అమితాబ్ నివాసంలో దీపావళి సందర్భంగా ఆదివారం బాలీవుడ్ సెలబ్రిటీలకు విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంజయ్‌దత్, రణ్‌బీర్ కపూర్, విద్యాబాలన్, ఫర్హాన్ అక్తర్ వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. ఆ ఫంక్షన్‌లోనే ఐష్, అభి బహిరంగంగా ముద్దు పెట్టుకుంటూ ఫోజులిచ్చారు.
దీంతో అభి-ఐష్ విడిపోనున్నారనే వార్తలకు చెక్ పడినట్టే! కానీ.. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పడానికి ఇంతకంటే మరే దారీ దొరక్కపోవడం శోచనీయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి