తమ 13 ఏళ్ల సహజీవనానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు నటి గౌతమి చేసిన ప్రకటనపై కమల్‌హాసన్ స్పందించారు.
‘ఆమెకు ఏది సౌకర్యమో అదే నాకూ ఇష్టం., ఇప్పుడు నా భావాలు ముఖ్యం కాదు. ఏదేమైనా గౌతమి, సుబ్బు (కుమార్తె) సంతోషంగా ఉంటే చాలు. ఆమెకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనుంటా. నాకు ముగ్గురు కుమార్తెలు- శ్రుతిహాసన, అక్షర, సుబ్బులక్ష్మి. ఈ ప్రపంచంలోనే అదృష్టవంతుడైన తండ్రిగా నన్ను నేను భావిస్తున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో కమల్ అన్నట్టు వచ్చిన వార్తలను కమల్ ఖండించాడు.
గౌతమి వ్యవహారంపై తాను ఎవరికీ, ఏమీ చెప్పలేదని కమల్‌హాసన్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశాడు.
ఇదిలా ఉండగా, కమల్ గౌతమి మధ్య విభేదాలకు కారణం శ్రుతిహాసనేనంటూ వస్తున్న వార్తలకు శ్రుతి తన మేనేజర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేస్తూ... ‘నేను ఎవరి వ్యక్తిగత జీవితం గురించి, వారి నిర్ణయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నాకు నా తల్లిదండ్రులు, సహోదరి, నా కుటుంబంపై అభిమానం, ప్రేమ, గౌరవ మర్యాదలు మాత్రమే ప్రధానం’ అని పేర్కొంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి