2019 ఎన్నికల్లో తాను పోటీచేస్తానని జనసేన నేత పవన్ కళ్యాన్ మొదటిసారిగా ప్రకటించాడు.
అనంతపురం లో ఏర్పాటు చేసిన సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ... 'గెలుస్తానో లేదో తెలియదు కానీ పోటీ చేస్తా, మీరు మద్దతిచ్చినా లేకున్నా, మీకు అండగా ఉంటాన'ని తెలిపాడు.
అలాగే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ మొదటి కార్యాలయాన్ని అనంతపురం జిల్లాలో ప్రారంభించనున్నట్లు పవన్ చెప్పారు. 'సీమ చరిత్ర రాసుకోవడానికి పేజీలకు పేజీలు ఉంది.. తాగడానికి మాత్రం చుక్కనీరు లేదు'. అని పవన్ వ్యాఖ్యానించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి