google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఎస్పీబాలూకి కేంద్రప్రభుత్వ పురస్కారం

2, నవంబర్ 2016, బుధవారం

ఎస్పీబాలూకి కేంద్రప్రభుత్వ పురస్కారం



గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి కేంద్ర ప్రభుత్వం 2016కిగాను 'సెంటినరీ అవార్డు ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ద ఇయర్‌ '  ప్రకటించింది. గోవాలో జరగనున్న భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి) ఉత్సవాల్లో దీన్ని ఆయనకు ప్రదానం చేస్తారు.

కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం దిల్లీలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అవార్డుతోపాటు బాలుకి రూ.10 లక్షల నగదు బహుమతి అందజేస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ను ఇదివరకు వహీదారెహమాన్‌, రజనీకాంత్‌, ఇళయరాజాలు  స్వీకరించివున్నారు.

 తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో 40వేలకు పైగా పాటలుపాడి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌రికార్డ్స్‌లో స్థానంపొందిన ఎస్పీ  నాలుగు భాషల నుంచి ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డులు పొందారు. లెక్కలేనన్ని రాష్ట్రస్థాయి అవార్డులతో బాటుగా  నటుడిగానూ ఎన్నో సినిమాల ద్వారా మెప్పించారు. బాలూని 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌ అవార్డులు కూడా వరించాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి