తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శారీరకంగా, మానసికంగా ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఇక ఆమె కోరుకున్నపుడు వెళ్ళిపోవచ్చని అపోలో ఆస్పత్రి చైర్మన ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు.
శనివారం ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ..జయ శరీరంలో ఇన్ఫెక్షన్ తొలగిపోయిందని, అయితే ఆమెను ఇంటికి పంపించే తేదీ ఇంకా నిర్ణయించలేదని, తాను కోరుకున్నప్పుడు వెళ్లొచ్చని అన్నారు.
జయలలిత కోరిక మేరకే ఆమెను ప్రత్యేక వార్డుకు మార్చడం జరిగింది., ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నప్పటికీ మామూలుగానే ఆమెకు నచ్చిన ఆహారాన్ని తీసుకుంటున్నారు..
సెప్టెంబర్ 22న ఆస్పత్రికి వచ్చిన జయలలితకు అనారోగ్యసమస్యలు పూర్తిగా తగ్గుముఖం పట్టినట్టే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి