అటు నాగ చైతన్యతో పాటు, ఇటు అఖిల్ కూడా ప్రేమలో పడటం, తమకు కాబోయే జీవిత భాగస్వాములను వారే స్వయంగా ఎంచుకోవడం తెలిసిందే. దీనితో అక్కినేని వారి ఇంట్లో త్వరలో వెడ్డింగ్ బెల్స్ మ్రోగబోతున్నాయి.
అయితే ఈ విషయంలో అఖిల్ అన్నయ్య కంటే కాస్త స్పీడుమీదున్నాడు. చైతూకంటే ముందుగా అఖిల్ నిస్చితార్థం జరగబోతోంది.
అఖిల్, కాస్ట్యూం డిజైనర్ శ్రేయాభోపాల్ ప్రేమలో ఉన్నాడనే విషయం తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ డిసెంబర్ 9న జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబందించి ఇన్విటేషన్ కార్డ్ బయటికి వచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
జీవీకే హౌస్ లో వీరి నిశ్చితార్థం జరగనుంది. సినీ, రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.
వివాహం మాత్రం ఇటలీలో చేయాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి