google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: డిసెంబరు తర్వాత వాట్సప్‌ రాదు !

3, నవంబర్ 2016, గురువారం

డిసెంబరు తర్వాత వాట్సప్‌ రాదు !



సింబియన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఫోన్‌ను వాడుతున్న వినియోగదారులకు దుర్వార్త!.

డిసెంబరు 31 తర్వాత వారి మొబైల్‌ ఫోన్లలో వాట్సప్‌ ఆప్‌ను వాడలేరు. ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ నోకియా హైఎండ్‌ మొబైళ్లలోను, ఎన్‌ సిరీస్‌తో ప్రారంభమయ్యే అన్ని ఫోన్లలోనూ, తరువాత వచ్చిన ఎన్‌8 సిరీస్‌ ఫోన్లలోను ఉంది..

వాట్సప్‌ సంస్థ సంవత్సరం ప్రారంభంలోనే వినియోగదారులందరికి ఈ విషయాన్ని వెల్లడించింది. సంవత్సరం ముగుస్తుండటంతో వినియోగదారులకు మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేస్తోంది. సింబియన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ని ఉపయోగిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులందరు కూడా అప్ డేట్ చేసుకోవాలని, ఆండ్రాయిడ్‌ 2.1, ఆండ్రాయిడ్‌ 2.2 వెర్షన్‌లతో నడుస్తున్న బ్లాక్‌బెర్రీ ఫోన్లలో కూడా వాట్సప్‌ను ఉపయోగించలేరని సంస్థ తెలిపింది.

అయితే నోకియా సంస్థ చాలా కాలం నుండి ఫోన్లను తయారు చేయడం ఆపివేసింది. గతంలో తయారుచేసిన నోకియా ఈ6, నోకియా 5233, నోకియా సి5 03, నోకియా ఆషా 306, నోకియా ఈ52 ఫోన్లలో సింబియన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి