చిరంజీవి శేష జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకే అంకితమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తేల్చి చెప్పారు.
చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారన్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
గత కొద్దికాలంగా..చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ కారణంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుంటున్నారు. ఏదో మొహమాటానికి తప్ప అంత యాక్టివ్ గా చిరు రాజకీయాల్లో లేదన్నది వాస్తవం.
ఇప్పుడు కాంగ్రెస్ లో మెగాస్టార్ అంత సంతృప్తిగా లేరని, త్వరలో పార్టీ మారుతారనే అనుమానాలకు చెక్ పెట్టడానికే రఘువీరా ఈ వ్యాఖ్యలు చేసారని అనుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి