సినిమా తీసినా, తీయకపోయినా నిత్యం వార్తల్లో వుండే రాంగోపాల్ వర్మ తాజాగా ఓ భారీ అంతర్జాతీయ సినిమా తీస్తానంటూ సెన్షేషన్ క్రియేట్ చేసాడు.
"నా మొదటి ఇంటర్నేషనల్ ఫిలిం 'న్యూక్లియర్' ను రూ. 340 కోట్లతో తీయబోతున్నాను. అమెరికా., చైనా,రష్యా, యెమెన్ లతో పాటు ఇండియాలో కూడా షూటింగ్ చేస్తాను . అమెరికన్, చైనీస్, రష్యన్, ఇండియన్ యాక్టర్స్ ఉంటారు.. నా కంపెనీతో 15 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉన్న సీఎంఏ గ్లోబల్ ఈ న్యూక్లియర్ ను నిర్మించనుంది" అని చెప్పాడు వర్మ.
ఇండియాలో మోదటిసారిగా రూ. 340 కోట్ల బారీ బడ్జెట్ తో మూవీ తెరకెక్కడం ఇదేమొదటిసారి.
ఈ మూవీ అనౌన్స్ మెంట్ రోజునే స్టోరీ సినాప్సిస్ కూడా వర్మ ప్రకటించేశాడు.
'ముంబైకి ఓ ఆటమిక్ స్మగుల్ చేయబడుతుంది. కశ్మీర్ ను ఖాళీ చేయాలనే డిమాండ్ చేస్తారు. పాకిస్తాన్ నాకేం సంబంధం లేదంటే.. అప్పుడు అమెరికా రంగంలోకి దిగుతుంది. తమ అన్ని రకాల సైన్యాన్ని మొహరించడానికి.. ఇండియా-పాక్ లను అమెరికా ఒప్పిస్తుంది. కోట్ల మంది జీవితాలు ప్రమాదంలో పడిపోతాయి. అదే మూడో ప్రపంచయుద్ధానికి నాంది' అనేది ఈ న్యూక్లియర్ సినిమా సినాప్సిస్.
టెర్రరిజం కంటే.. అణుబాంబు ఇంకా ప్రమాదం అన్న వర్మ.. దాన్ని ఉపయోగించడం మళ్లీ జరిగితే.. అది ఇండియాలో ఆ బాంబ్ పేలితే అన్న కాన్సెప్ట్ తో న్యూక్లియర్ ను తీయనున్నట్టు చెప్పాడు వర్మ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి