google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: లవ్‌ ఫెస్టివల్‌ను అడ్డుకుంటాం

4, నవంబర్ 2016, శుక్రవారం

లవ్‌ ఫెస్టివల్‌ను అడ్డుకుంటాం




ఫిబ్రవరిలో విశాఖ తీరంలో ప్రభుత్వం నిర్వహించబోయే  ‘లవ్‌ ఫెస్టివల్‌’ను అడ్డుకుంటామని వైసీపీ ఎమ్మెల్యే సినీనటి రోజా పేర్కొన్నారు.

గురువారం  ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రపంచ దేశాలన్నీ భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలపై ఆసక్తి చూపుతుంటే బికినీలతో బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహించడం ద్వారా దేశ సంస్కృతీ సంప్రదాయాలను సీఎం భ్రష్టు పట్టిస్తున్నారు' అని విమర్శించారు.

టిడిపి మిత్రపక్షం, దేశ భక్తులుగా చెప్పుకొనే బీజేపీ దానిని ఎందుకు ఖండించడం లేదని ఆమె ప్రశ్నించారు.

ఆడజాతి గౌరవాన్ని కించపరిచేలా చేస్తున్న ఈ కార్యక్రమంపై భువనేశ్వరి, బ్రాహ్మణి స్పందించాలని రోజా డిమాండ్‌ చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి