పొందిన సహాయాన్ని మర్చిపోకుండా, కృతజ్ఞతతో ఓ ఆడియో ఫంక్షన్ కి హాజరవబోతున్నాడు పవర్ స్టార్.
కమెడియన్ సప్తగిరి హీరోగా వస్తున్న చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’. ఈ నెల 6 న ఈ సినిమా ఆడియో విడుదల కాబోతోంది. సాధారణంగా నితిన్ కి తప్ప మరే హీరో ఆడియో ఫంక్షన్ కి వెళ్ళని పవన్ సప్తగిరి సినిమాకు మాత్రం హాజరై పాటల్ని రిలీజ్ చేయబోతున్నాడు
మొదటగా ఈ సినిమాకు ' కాటమరాయుడు ' అనే టైటిల్ ని రిజిస్టర్ చేసారు., కానీ పవన్ ఆ పేరును కోరడంతో పవర్ స్టార్ మీద అభిమానంతో 'సప్తగిరి ఎక్స్ ప్రెస్ ' చిత్ర నిర్మాతలు ఇచ్చేసారు.
ఆ కృతజ్ఞతతో పవన్ ఆడియో ఫంక్షన్ కి రావడానికి ఒప్పుకుని తన పెద్ద మనసును చాటుకున్నాడు.
ఈ సినిమాకు అరుణ్ పవార్ దర్శకుడు. దీనికి కథానాయకుడైన సప్తగిరి నే స్క్రీన్ ప్లే రాసినట్టు తెలుస్తొంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి