కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన భారత్.. ఇప్పుడు కరెన్సీ తో మరోసారి స్టైక్స్ చేసింది.
రూ 500,1000 నోట్ల రద్దువల్ల పాకిస్థాన్‌ను మాత్రమే కాదు, అక్కడి ఉగ్రవాదులు, మాఫియాను కోలుకోలేని చావుదెబ్బ తీసినట్టైంది.
భారతదేశాన్ని ఆర్థికంగా బలహీనపరచడమే ధ్యేయంగా అక్కడి మాఫియా నకిలీ ఇండియన్ కరెన్సీని ముద్రిస్తోంది. మరీ ముఖ్యంగా 1000, 500 నోట్లను ముద్రించడం కోసం దుబాయ్‌లో ఏకంగా ప్రింటింగ్ ప్రెస్‌నే ఏర్పాటు చేసింది. దశాబ్దాలుగా అక్కడ ముద్రించిన నోట్లను బంగ్లాదేశ్, శ్రీలంక మీదుగా భారతలోకి రవాణా చేస్తోంది.
పాక్ సరిహద్దుల నుంచి భారతలోకి పాకిస్థాన్ ఉగ్రవాదులుతో పాటుగా నకిలీ కరెన్సీనీ ని కూడా చొప్పిస్తోంది! ఇలా ప్రతి రోజూ కొన్ని కోట్ల రూపాయలు భారత మార్కెట్లోకి వచ్చి పడుతున్నాయి.
వందల కోట్ల రూపాయల నకిలీ డబ్బు పెరిగిపోవడంతో రూపాయల విలువ పడిపోయి తద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. పాక్ అండదండలతో దావూద్ మాఫియా అయితే వందల కోట్ల నకిలీ కరెన్సీ చలామణీ చేస్తోంది. 1000, 500 నోట్ల రద్దుతో ఇప్పుడు ఆ కరెన్సీ మొత్తం రద్దవుతుంది. ఇప్పుడు కొత్త నోట్లను ముద్రించాలంటే పాకిస్థాన్ కు భారీగా ఖర్చు అవుతుంది. అందుకు చాలా సమయం శ్రమ పడుతుంది.
దీంతో, ఒక్క దెబ్బతో ఇటు దేశంలోని నల్ల కుబేరులను చావు దెబ్బ తీసిన ప్రధాని మోదీ.. అటు ఉగ్రవాదులు, మాఫియాకూ పూర్తిస్థాయిలో చెక్ పెట్టినట్టైంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి