google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: కండోమ్‌ కాదు స్టూడెంట్ ఎక్కడో చెప్పండి!

8, నవంబర్ 2016, మంగళవారం

కండోమ్‌ కాదు స్టూడెంట్ ఎక్కడో చెప్పండి!




జేఎన్‌యూలో రోజుకు ఎన్ని కండోమ్‌లు వాడుతున్నారో లెక్కలు చెప్పే అధికారులు, అక్టోబర్‌ 15నుంచి కనిపించకుండా పోయిన నజీబ్‌ ఆచూకిని మాత్రం  కనిపెట్టలేకపోయారా? అని జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్నయ్యకుమార్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.

నిన్న కన్నయ్య రాసిన ‘బిహార్‌ టూ తీహార్‌’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.

జేఎన్‌యూలో ప్రతి రోజు 3వేల బీర్‌ బాటిళ్లు, 10వేల సిగరెట్‌ ప్యాకెట్లు, 4వేల బీడీలు, 3వేల వాడిపడేసిన కండోమ్‌లు, అబార్షన్‌ అయ్యేందుకు ఉపయోగించే 500 ఇంజక్షన్లు దొరుకుతాయని భాజపా ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్‌ అహూజా గతంలో అన్న మాటలను ప్రస్తావిస్తూ కన్నయ్య ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్‌ ప్రాంతానికి చెందిన నజీబ్‌(27) అక్టోబర్‌ 15 నుంచి కనిపించకుండా పోయాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి