‘నరుడాడోనరుడా’ ఈరోజు విడుదలవుతోంది.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో సుమంత్ సోషల్ మీడియా లైవ్‌షోలో పాల్గొని అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చాడు.
‘మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘నేను అందరి పెళ్లిల్లకు వెళ్తా గానీ, నా పెళ్లికి మాత్రం వెళ్లను’ అని సరదాగా చెప్పాడు. అలాగే మరో అభిమాని ‘మీ అభిమాన నటుడెవరు’ అని అడిగితే. ‘నా ఫేవరెట్ హీరో మహేష్‌బాబు.. సారీ పవర్‌స్టార్ ఫ్యాన్స్’ అని తడుముకోకుండా సమాధానమిచ్చాడు.
అలాగే ఎవరైనా విలన్ పాత్రలు ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని సుమంత్ వెల్లడించాడు.
అయినా మధ్యలో పవర్ స్టార్ అభిమానుల్ని గెలకడం ఎందుకు సుమంత్?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి