‘మాస్తిగుడి’ సినిమా చిత్రీకరణ సమయంలో హెలికాఫ్టర్ నుంచి చెరువులో పడి మునిగిపోయిన ఇద్దరు కన్నడ నటుల్లో మరొక నటుడి మృతదేహం కూడా లభించింది.
నటుడు అనిల్ మృతదేహాన్నిఈరోజు చెరువులో గుర్తించారు. గజ ఈతగాళ్లు, స్థానికులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యల చేపట్టగా.. నిన్న ఉదయం ఉదయ్ రాఘవ మృతదేహం లభించింది. కాగా అనిల్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించిన సిబ్బంది ఈ రోజు ఉదయం అతని మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకొచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి