google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: జయలలిత పూర్తిగా కోలుకున్నారు

4, నవంబర్ 2016, శుక్రవారం

జయలలిత పూర్తిగా కోలుకున్నారు




తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని అపోలో హాస్పిటల్స్‌ సీఎండీ ప్రతాప్‌ సి.రెడ్డి తెలిపారు.

జయలలిత ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం ఆయన బులిటెన్ విడుదల చేశారు. ‘ జయలలిత పూర్తిగా కోలుకున్నారు. ఆమెకు ఏం కావాలో అడుగుతున్నారు. తనచుట్టూ ఏం జరుగుతుందనే విషయాలు తెలుసుకుంటున్నారు. ఎప్పుడు ఇంటికి వెళ్లాలనే దానిపై ఆమే నిర్ణయం తీసుకుంటారు’ అని ఆయన వెల్లడించారు.

జయలలిత కోలుకున్నారని, త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారని అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. రెండురోజుల్లో క్రిటకల్‌ కేర్‌ విభాగం నుంచి సాధారణ గదికి త్వరలోనే మార్చనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి