google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: నాగ్ మరో ప్రయోగం

30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

నాగ్ మరో ప్రయోగం



 మొదటినుంచీ ప్రయోగాత్మక పాత్రలకు వెనుకాడని హీరో నాగార్జున మరోసారి పూర్తిస్థాయి అంధుడిగా నటించడానికి సిద్దమవుతున్నాడు.

మళయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన 'ఓప్పం' రీమేక్ లో నటింపజేయడానికి ఓవర్సీస్ నెట్ వర్క్ సెంటర్ వాళ్ళు నాగార్జునతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.

మళయాళంలో సూపర్ హిట్టైన ఈ 'ఓప్పం" దర్శకుడు ప్రియదర్శన్ తెలుగువారికి సుపరిచితుడే. ఇంతకుముందు తెలుగులో నాగ్ హీరోగా నటించిన 'నిర్ణయం' సినిమాకికూడా ప్రియదర్శనే దర్శకుడు.

అంధుడైన హీరో ఓ హత్యోదాంతాన్ని ఎలా ఛేధించాడు, హంతకుడ్ని చట్టానికి ఎలా అప్పగించాడు అనే ఆసక్తికరమైన కథనంతో ఇది తెరకెక్కింది.

ఊపిరి మూవీలో వీల్ చైర్ కి అంకితమైన పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించిన నాగార్జున,మరోసారి   అంధుడిగా నటించి తన ప్రత్యేకతను చాటుకోనున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి