30, సెప్టెంబర్ 2021, గురువారం
15, సెప్టెంబర్ 2021, బుధవారం
Weight Loss With Fennel Seeds బరువుని తగ్గించే సోంపు వాటర్
బరువుని తగ్గించే సోంపు వాటర్
దాదాపు ప్రతీ ఇంటిలో సోంపు గింజల్ని ఉపయోగిస్తూనే ఉంటారు. శరీర బరువును తగ్గించడానికి కూడా సోంపు ఉపయోగపడ్తుంది.
సోంపును సాధారణంగా భోజనం తర్వాత మౌత్ ఫ్రెషనర్ గా ఇంకా, జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు తీసుకుంటాం. నిజానికి దీనిని రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఇది ఆస్తమా, ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
సోంపుతో బరువు ఎలా తగ్గుతుంది?
సోంపు లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి జీర్ణక్రియ, జీవక్రియలో సహాయపడతాయి. ఇంకా ఆకలిని కూడా తగ్గిస్తుంది.
ఉదయాన్నే ఒక గ్లాసు సోంపు నీరు తాగడం వల్ల కడుపు నిండిన భావన వస్తుంది. దీంతో ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాలనే కోర్కె తగ్గుతుంది.
సోంపు వాటర్
ఒక టీస్పూన్ సోంపు గింజలను తీసుకుని, ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈ నీటిని పరగడుపున ఉదయం నిద్ర లేవగానే తాగడం వల్ల మంచి ప్రయోజనం వుంటుంది.
సోంపు జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో సోంపు వాటర్ తీసుకుంటే చాలా మంచింది.
సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటి ఉదయాన్నే తీసుకుంటే ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంచుతుంది. ఎక్కువగా తినకుండా నిరోధిస్తుంది. దీంతో శరీర బరువు కచ్చితంగా తగ్గుతుంది.
ఫెన్నెల్ ఒక సహజ డిటాక్సిఫైయర్. అందువల్ల భోజనం చేసిన వెంటనే దీనిని తీసుకుంటే బాగా పనిచేస్తుంది. ఇది మన శరీరం నుంచి అనేక టాక్సిన్‌లను తొలగిస్తుంది.
సోంపులో జింక్, భాస్వరం, మాంగనీస్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇది ఊబకాయంతోపాటు ఇతర వ్యాధులు రాకుండా కాపాడుతాయి.
ఎస్ట్రాగోల్, ఫెంచాన్, అనెథోల్ వంటివి సోంపులో ఉంటాయి. ఇవి తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావడంతో సహాయపడుతాయి.
సోంపు నీరు తాగడం వలన శరీరంలో ఉండే అదనపు నీరు తొలగిపోతుంది.
11, సెప్టెంబర్ 2021, శనివారం
వత్తిడి ని తగ్గించే 5 మార్గాలు
వత్తిడి ని తగ్గించే 5 మార్గాలు
ఆహారం:
మంచి ఆహారం కూడా వత్తిడి ని తగ్గిస్తుంది. బలమైన ఆహారం మన మెదడును చురుగ్గా వుండేలా చస్తుంది.
ఆహారం వల్ల శరీరం మొత్తం యాక్టివ్ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.
ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ వల్ల టెన్షన్ తగ్గే అవకాశం వుంటుంది.
విశ్రాంతి తీసుకోవాలి:
వరుసగా పనులు చేస్తూ ఉన్నాగానీ వత్తిడి పెరుగుతుంది. అందువల్ల దృష్టిని మరల్చుకోవాలి. పనిలో కాస్త బ్రేక్ తీసుకోవాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వార్తలకు దూరంగా ఉండాలి. పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. పనిచసే మధ్య మధ్య పజిల్స్, బోర్డ్ గేమ్స్ ఆడుతుండాలి. ప్రకృతిలో తిరగాలి. ఓ కొత్త పుస్తకం చదవాలి. లేదా నచ్చిన వ్యాపకాన్ని చెయ్యాలి.
వ్యాయామం:
వ్యాయామం అనేది ఒత్తిడిని జయించేందుకు తిరుగులేని అస్త్రంగా చెప్పుకోవచ్చు. వాకింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం, దిగడం, పిల్లలతో ఆటలు, సైక్లింగ్, పెంపుడు జంతువులతో ఆటలు, శరీరాన్ని కదిలించే చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు కూడా ఒత్తిడిని జయించేలా చెయ్యగలవు. వ్యాయామం చేసినప్పుడు బాడీలో ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతుంది, ఇది పాజిటివ్ ఫీలింగ్స్‌ని పెంచుతుంది.
మానవ సంబంధాలు:
వీలైనప్పుడల్లా అందరితో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించాలి. ఫ్రెండ్స్‌తో మాట్లాడాలి. అభిప్రాయాలు షేర్ చేసుకోవాలి.
సన్నిహితులతో సమస్యల్ని పంచుకోవడం ద్వారా సాంత్వన లభిస్తుంది.
వీలైనంత ఒంటరిగా లేకుండా ప్రకృతితో గడపాలి. స్వచ్ఛమైన గాలిని పీల్చాలి. ఓకే చోట ఎక్కువసేపు ఉండకూడదు
తగినంత నిద్ర:
ఒత్తిడికి అనేక కారణాల్లో ఒకటి నిద్ర లేమి. ఆరోగ్యంగా వుండాలంటే మనం రోజుకు కనీసం 6 గంటలు పడుకోవాలి. అలాగే, విశ్రాంతి కూడా తీసుకోవాలి. మంచి నిద్ర వల్ల శరీరంలో అన్ని అవయవాలు ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటాయి. బ్రెయిన్ బాగా పనిచేసి, పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. అందువల్ల ఒత్తిడిని చాలా వరకూ తగ్గించుకోవచ్చు.
10, సెప్టెంబర్ 2021, శుక్రవారం
సుఖనిద్ర కోసం కొత్త పరికరం! Sleep Aid Device
సుఖనిద్ర కోసం కొత్త పరికరం!
ప్రస్తుత ప్రపంచంలో నిద్రలేమి సమస్యతో ఎన్నో కోట్ల మంది బాధపడుతున్నారు. మానసిక ఆందోళన, లేదా రాత్రి పూట మొబైల్ ఫోన్ ని ఎక్కువగా వినియోగిస్తుండటం కారణంగా నిద్ర అనేది కరువైపోతోంది.
దీనికి పరిష్కారంగా జర్మన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త పరికరాన్ని కనుగొన్నారు.
మైక్రో–కరెంట్ స్మార్ట్ హిప్నాసిస్ ఇస్ట్రుమెంట్ అనే పరికరాన్ని శాస్త్రవేత్తలు హైటెక్నాలజీతో రూపొందించారు.
ఈ పరికరం ముఖ్యంగా తగినంత నిద్ర లేకుండా బాధపడేవారికి ఎంతగానో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించి నిద్రపుచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఎలా పని చేస్తుంది?
ఈ డివైజ్‌ని చేతితో పట్టుకుని, రిలాక్స్‌డ్‌గా కళ్లు మూసుకుంటే చాలు., మెదడులోని కండరాలను ఉత్తేజపరచి, నిద్రపోయేలా చేస్తుంది.
ఈ డివైస్ చాలా మరియు తేలికైనది కూడా.
మైక్రో–కరెంట్ స్మార్ట్ హిప్నాసిస్ ఇస్ట్రుమెంట్ ని సులభంగా ఆపరేట్ చేసుకోవచ్చు. దీనిలో వర్కింగ్ మోడ్స్ ని కూడా అమర్చారు. తీవ్రతను పెంచడానికి లేదా తగ్గించడానికి ప్లస్ మైనస్ బటన్స్ కూడా ఉంటాయి.
ఈ స్లీప్ ఎయిడ్ పరికరాన్ని కార్యాలయాల్లో, ఇంట్లో, వ్యాపార పర్యటన ప్రాంతాల్లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.
సుమారు 15 నిమిషాలు వాడితే, తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా నివారిస్తుందని చెబుతున్నారు.
ఈ డివైస్ చేతికి బ్రేస్‌లెట్‌లా వేసుకోవచ్చు.
ధర ఎంత?
దీని ధర సుమారు 30 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ లో సుమారు రూ. 2,200 వరకు ఉంటుంది.
సరైన నిద్ర లేకపోవడం వల్ల వచ్చే అనేక రోగాలనుండి ఈ పరికరం కాపాడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
6, సెప్టెంబర్ 2021, సోమవారం
ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం Digestive System
ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం
Digestive System
ఆధునిక ప్రపంచంలో జీవనశైలిలో వచ్చిన పెను మార్పులవల్ల, పూర్తిగా మారిపోయిన ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో జీర్ణ వ్యవస్తకు సంబంధించిన అనేక సమస్యలతో భాదపడ్తున్నారు.
ప్రతిఒక్కరూ రుచికరమైన ఆహారం కోసమని ముందువెనుక ఆలోచించకుండా జంక్ ఫుడ్ లాంటివి తింటూ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు.
జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోతే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆహారం కొద్దిగా తిన్నాగానీ గ్యాస్ట్రిక్, అజీర్తి, కడుపు నొప్పి, కడుపులో మంట లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.
ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం ప్రతి ఒక్కరు తేలిగ్గా పాటించగల పద్దతులను కొన్ని ఉన్నాయి . వాటి గురించి తెలుసుకుందాం.
* ఫైబర్ పదార్థాలు
పళ్లు, తృణధాన్యాలు, కూరగాయలు లాంటి ఫైబర్ ఎక్కువ పదార్థాలున్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరును పెంచుకోవచ్చు. వాటివల్ల సులభంగా జీర్ణ ప్రక్రియ జరుగుతుంది. ఇవి మలబద్ధకం, అతిసారం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను నివారిస్తాయి.
* ఆహారాన్ని నమలడం
మనలో చాలామంది ఆహారాన్ని సరిగ్గా నమలరు. దీంతో ఆ పదార్థాలు అరగడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆరోగ్య కరమైన జీర్ణ వ్యవస్థ కోసం మీరు ఆహారాన్ని మెత్తగా నమలాలి. అప్పుడే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
* ఆరోగ్యకరమైన జీవనశైలి
మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. కంటికి ఇంపుగా కనిపించింది కదాని వేళాపాళా లేకుండా ఆహారాన్ని భుజించకూడదు.
* మాంసాహారాన్ని తగ్గించాలి
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది. మరీ అంతగా తినాలని వున్నపుడు కొవ్వులు ఎక్కువ లేకుండా ఉండే మాంసం తినాలి. సాధారణంగా మాంసాహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది ఇది మలబద్ధకానికి దారి తీస్తుంది. మటన్ కంటే చికెన్ కాస్త బెటర్
* తగినంత నీరు తప్పనిసరి
ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం తరచూ నీరు తాగుతుండాలి. ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో నీరు చాలా ఉపయోగపడుతుంది.













