google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU

14, ఆగస్టు 2021, శనివారం

చుండ్రుకి ఆయుర్వేద పరిష్కారం DANDRUFF TREATMENT WITH NEEM LEAFS


చుండ్రుకి ఆయుర్వేద పరిష్కారం

 సుధీర్గకాలంగా పట్టిపీడిస్తున్న చుండ్రు సమస్యని తగ్గ్గించుకోవడానికి అయుర్వేదంలో అనేక చక్కని పరిష్కారమార్గాలు వున్నాయి.

మనకు విరివిగా దొరికే వేపాకుతో చుండ్రుని వదిలించుకోవడం చాలా తేలిక.

చుండ్రుకి అత్యంత ప్రభావవంతమైన నివారణలలో వేప ఒకటి.   

ఆయుర్వేద వైద్యంలో వేప అనేక రకాల రుగ్మతలకు చాలా ముఖ్యమైన ఔషదంగా చెప్పబడింది.   

చర్మం మరియు జుట్టు సమస్యలకు అధ్భుతంగా ఉపయోగపడుతుంది. 

మనం Dandruff  నివారణకోసం వేపాకుతో ఏంచెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.  

20 లేదా 30 వేపాకులను 2 లీటర్ల నీటిలో వేసుకుని రాత్రంతా నానపెట్టుకోవాలి. ఆతర్వాత  వేప ఆకులు వేసిన నీరు ఆకు పచ్చగా మారే వరకు మరగబెట్టాలి,  నీరు చల్లబడిన తర్వాత జుట్టును వేపాకు నీటితో శుభ్రం చసుకోవాలి.  

ఇలా రెగ్యులర్ గా తలస్నానం చేస్తూవుంటే జుట్టులో ఉన్న చుండ్రు తగ్గుముఖం పడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది చుండ్రు వల్ల కలిగే దురద లాంటి అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. 

చుండ్రు సమస్యను పూర్తిగా వదిలించుకోవడానికి వారానికి రెండుసార్లు లేదా మూడుసార్లు ఈ వేపాకును ఉపయోగిస్తూ వుండటంవల్ల మంచి ఫలితం వుంటుంది.  

సింపుల్ ఒన్ ఎలక్ట్రిక్ స్కూటెర్



 పెరుగుతున్న పెట్రోల్ ధరలను ద్రృష్టిలో పెట్టుకోవడమే కాకుండా, వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించాలనే స్ప్రుహ కూడా ప్రజలలో కలుగుతూ వుండటంతో తయారీధారులు ఈమధ్య అటువంటి వాహనాలను ఉత్పత్తి చేయడానికే ప్రాథాన్యతను ఇస్తున్నారు.     

ఇక వినియోగదారులను కూడా ఈ వాహనాలు ఆకర్షిస్తున్నాయి. 

తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'సింపుల్ ఎనర్జీ' తన మొదటి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను స్వాతంత్ర దినోత్సవ కానుకగా లాంఛ్ చేయడానికి రెడీ అయ్యింది. 

ఆగస్టు 15న ఎలక్ట్రిక్ స్కూటర్ ను రిలీజ్ చేయనున్నట్టు  ప్రకటించింది.

ఈ  స్కూటర్ కావాలనుకునే వినియోగదారులు కంపెనీ వెబ్ సైట్లో రేపు సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఇందుకు గాను రూ. 1,947 చెల్లించాల్సి ఉంటుంది 

ఇక ఈ  ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే టచ్ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆన్ బోర్డ్ నావిగేషన్ సపోర్ట్ ఉన్నాయి. సింగిల్ చార్జ్ చేస్తే 240 కి.మీ మైలేజ్ ఇస్తుంది.   

ధర రూ. 1,00,000 నుంచి రూ. 1,20,000 వరకు ఉంటుందని తెలుస్తోంది. 

13, ఆగస్టు 2021, శుక్రవారం

కరోనా కి ముక్కు ద్వారా వ్యాక్సిన్!



 ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాని నియంత్రించేందుకు మరో ముందడుగు పడింది.

ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ క్లినికల్ ట్రైల్స్ కి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది .

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ (నాజల్‌ వ్యాక్సిన్‌)కు ఒకే చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 


ఇప్పటికే 18 నుంచి 60 ఏళ్ల వయసుల వారిపై నిర్వహించిన తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌  విజయవంతంగా పూర్తయ్యినట్లు తెలిసింది.

రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు అనుమతి మంజూరు చేసినట్టు  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ  వెల్లడించింది. 


 ‘కొవాగ్జిన్‌’ టీకాను తయారు చేసిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ.. ముక్కు ద్వారా ఇచ్చే టీకా అడెనోవైరస్‌ వెక్టార్డ్‌  అభివృద్ధిపై ఫోకస్ చేసింది.  

గతేడాది సెప్టెంబరులో భారత్‌ బయోటెక్‌, యూఎస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇన్‌ సెయింట్‌ లూయీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 

కాగా ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌ కరోనాపై సమర్థంగా పనిచేస్తున్నట్లు ఇప్పటికే జంతువులపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచలోనే తొలిసారి ముక్కు ద్వారా వేసే కోవిడ్ వ్యాక్సిన్‌ను భారత్‌ బయెటెక్‌ అభివృద్ధి చేస్తోంది. 

ట్రెండింగ్ లో పుష్ప 'దాక్కో దాక్కో' సాంగ్


 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న లెటేస్ట్ చిత్రం పుష్ప.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పుష్పరాజ్ ఇంట్రడ్యూసింగ్ వీడియో రికార్డ్స్ సృష్టించగా, 

తాజాగా విడుదలైన, ఈ మూవీ ఫస్ట్ సాంగ్ 'దాక్కో దాక్కో మేక' ప్రోమోవీడియోకు రెస్పాన్స్ అదిరిపోయే రేంజ్లో వస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని  రెండు భాగాలుగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో అల్లూర్జున్ ఊరమాస్ లుక్‏లో కనిపించబోతుండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

బన్నీకి జోడిగా రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటిస్తోంది.   

ఆకలి ఆకలి అంటూ  కొనసాగే  ఈపాటకి లిరిక్ రైటర్ చంద్రబోస్ కాగా  బన్నీస్టెప్పులతో, తనదైన మాస్ ఎక్స్‏ప్రెషన్స్‏తో అదరగొట్టాడు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ సరికొత్తగా ఆకట్టుకునేలా ఉంది.   

ఈ పాటను సింగర్ శివమ్ ఆలపించాడు.

కాకినాడలో అమీర్ ఖాన్



 ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ ఖాన్‌  'లాల్‌సింగ్‌ చద్దా' సినిమా షూటింగ్‌ నిమిత్తం, తూర్పుగోదావరి జిల్లా ఖాకినాడ కు విచ్చేసారు.


జిల్లాలోని  ప్రాంతాల్లో  పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 


శుక్రవారం అమలాపురంలో, శనివారం కాకినాడలో చిత్రీకరణ జరగనుంది. 

మరో విశేషం ఏమిటంటే తెలుగు యువనటుడు అక్కినేని నాగచైతన్య కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. .

అమీర్‌ఖాన్‌ కాకినాడలోని కాసరోవర్ హోటల్‌లో బసచేయడంతో, ఆ చుట్టుప్రక్కల సందడి నెలకొంది . కొవిడ్‌ నేపథ్యంలో అమీర్ ను కలిసేందుకు ఎవరికీ అనుమతి లేకపోయినా, షూటింగ్ జరుగుతున్న ప్రదేశాలలో పెద్దసంఖ్యలో సినీ అభిమానులు చేరుతున్నారు.