google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU

1, అక్టోబర్ 2016, శనివారం

డీ.కే. అరుణ రాజీనామా



గద్వాల కేంద్రంగా జోగులాంబజిల్లా ఏర్పాటు చెయ్యనందుకు నిరసనగా గద్వాల్ యం ఎల్ ఏ డీకే.అరుణ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి, రాజీనామాలేఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించారు.

తన పదవే జిల్లా ఏర్పాటుకు అడ్డమని అనుకునే పక్షంలో రాజీనామాలేఖను స్పీకర్ కు పంపించి ఆమోదింపజేసుకోవచ్చని ఆమె తెలియజేసారు.

జోగులాంబజిల్లా కోసం ఏళ్ళతరబడి ప్రజలు పోరాటం చేస్తున్నా పట్టించుకోకుండా, లక్షలమంది వ్యతిరేకిస్తున్న వనపర్తిజిల్లాను ఏర్పాటు చేసినందుకు అరుణ తన నిరశనను ఇలా తెలియజేసారు. 

జయ ఆరోగ్యంగా వున్నారు



పుకార్లకు తెరదించుతూ, పురచ్చితలైవి ఆరోగ్యంగా వున్నారని, రెండుమూడురోజుల్లో డిస్చార్జ్ అవుతారనీ అన్నాడియంకే వర్గాలు తెలియజేసాయి.

యూకే డాక్టర్ల పర్యవేక్షణ లో డా.రిచర్డ్స్ చికిత్స చేస్తున్నారని, దానికి సంబందించి ఎలాంటి ఫోటోలు చూపించాల్సిన అవసరం లేదని, తాము ప్రజలకు మాత్రమే భాద్యత వహిస్తామని పరోక్షంగా డీ.యం.కే శ్రేణులను ఉద్దేశించి ప్రకటనను విడుదల చేసారు.

పుకార్లు సృష్ఠిస్తున్నారన్న కారణంతో 30మంది డీ.యం.కే కార్యకర్తలను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా, చెన్నై అపోలో హాస్పిటల్ ముందు భారీగా పోలీస్ బంధోబస్తు ఏర్పాటు చేసారు.

రెండురోజులుగా ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల కాకపోవడంతో రీగన్ యస్ బెల్ అనే న్యాయవాది, గవర్నర్ కలగజేసుకుని జయ ఆరోగ్యంపై ప్రకటన విడుదల చెయ్యాలని రాస్ట్రపతికి లెటర్ వ్రాసారు.

ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని అపోలో ముందు సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి.

బాహుబలి సర్ ప్రైజ్ ప్యాక్



సినిమా విడుదలకు ముందే, ప్రేక్షకుల్ని సంబ్రమాశ్చర్యాలకు గురిచేయనున్నట్టు దర్శకుడు రాజమౌళి తెలియజేసాడు.

నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బాహుబలి ది కంక్లూజన్ కి సంబందించి లోగోని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ అనేక విషయాలు వెల్లడించాడు. 

వర్చువల్ రియాలిటీ ద్వారా మాహిష్మతి సామ్రాజ్యాన్ని ప్రేక్షకుల కంటిముందుకే తీసుకొస్తున్నామని, దీనికి సంబందించి యానిమేషన్, గూగుల్ కార్డ్ కోసం 25కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు తెలియజేసాడు.

ఈనెల 5న ప్రభాస్ అభిమానులకోసం ఒక స్వీట్ న్యూస్ వుండబోతోందని, 
ప్రభాస్ బర్త్ డే ఒకరోజు ముందుగా అంటే అక్టోబర్ 22న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందనీ చెప్పాడు.

టీజర్, ట్రైలర్ మాత్రం 2017 జనవరి లో వుండొచ్చని తెలుస్తోంది. 

కాగా బాహుబలి కి ఇది మొదలు కాదు, చివరాకాదు అంటూ మూడో పార్ట్ కూడా వుండొచ్చు అనేలా ఊహాగానాలకు తావిచ్చేలా  రాజమౌళి మాట్లాడారు.

ఈ సినిమా 2017 ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో  తెలుసుకోవాలంటే అంతవరకు ఓపిక పట్టకతప్పదు.

అమ్మకు ఏమైంది..??



తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరొగ్యపరిస్థితి మీద వదంతులు షికారు చేస్తున్నాయి.

హాస్పిటల్లో చేరి వారంరోజులు దాటినప్పటికీ, ఆమె హెల్త్ కండిషన్ గురించి అధికారికంగా ఎటువంటి వార్తలు ప్రభుత్వం తరపున రాకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.



కాగా ప్రతిపక్ష డీ.యం.కే. అధినేత కరుణానిధి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చికిత్సకు సంబంధించి ఫోటోలు రిలీజ్ చెయ్యాలని, వారంరోజులైనా ముఖ్యమంత్రిని రాష్ట్ర గవర్నర్ ఎందుకు పరామర్శించలేదో తెలియజేయాలని డిమాండ్ చేసారు.

కాగా, వదంతులు సృష్టించేవారికి కఠిన శిక్షలు తప్పవని చెన్నై పోలీసుకమీషనర్ జార్జ్ హెచ్చరించారు.

వరుణ్ తేజ్ కి ప్రమాదం




'మిష్టర్ ' సినిమా కోసం యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తూవుండగా, యువనటుడు వరుణ్ తేజ్ ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. ఊటీలో చిత్రీకరణ జరుగుతూవుండగా ఈ ప్రమాదం జరిగింది. అక్కడేవున్న హాస్పిటల్ లో చికిత్స అనంతరం చిత్ర యూనిట్ మాట్లాడుతూ, వరుణ్ కుడికాలికి చిన్న గాయం అయిందనీ, ఆందోళణ పడాల్సిన అవసరం లేదని తెలియజేసింది.

ఈ మూవీకి శ్రీనువైట్ల దర్శకుడు.