google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU

1, నవంబర్ 2016, మంగళవారం

కమల్, గౌతమి విడిపోవడానికి కారణాలేంటి?




13 ఏళ్ల పాటు సాగిన కమల్-గౌతమి  సహజీవనానికి బ్రేక్ పడబోతోంది.

దీనికి రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కమల్ స్వంత సినిమా ‘శభాష్‌నాయుడు’ సినిమా సమయంలో గౌతమి సూచించిన కాస్టూమ్స్‌పై కమల్ పెద్ద కూతురు శృతిహాసన్ అభ్యంతరం వ్యక్తం చేసిందట. అప్పుడు మొదలైన వివాదం పెద్దదిగా మారి విడిపోయెంతవరకు వచ్చిందని సన్నిహితుల అంటున్నారు.

అంతేకాకుండా.. గౌతమి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆమె ఈమధ్య ప్రధాని మోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కలిసిందని చెబుతున్నారు.

ముందునుంచి రాజకీయాలంటే కమల్ హాసన్ కు పెద్దగా గిట్టదు. తన  పొలిటికల్ ఎంట్రీ వల్ల కమల్‌కు ఎలాంటి నష్టం కలిగించకూడదన్న భావనతో కూడా గౌతమి ఈ నిర్ణయం తీసుకుని ఉండచ్చని కూడా అనుకుంటున్నారు.

చైనా టపాకాయలు తుస్స్..




ఈమధ్య చైనా వస్తువులకు వ్యతిరేఖంగా  సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం మంచి ప్రభావాన్నే చూపినట్టుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో చైనా వస్తువుల అమ్మకాలు 60 శాతం వరకు పడిపోయినట్టు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సిఎఐటి) తెలిపింది. సోషల్‌ మీడియాలో విస్తృతంగా జరిగిన ఈ ప్రచారంతో వినియోగదారులతోపాటు, వ్యాపారులు కూడా చైనా వస్తువులు అమ్మేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు.

ముఖ్యంగా దీపాళి టపాకాయలపై ఈ ప్రభావం కాస్త ఎక్కువగా పడినట్టు తెలుస్తోంది. వ్యాపారులు తమ షాపుల్లో చైనా వస్తువులు ప్రదర్శించేందుకు ఆసక్తి చూపకుండా..  ఖాతాదారులను ఆకర్షించేందుకు మా షాపులో భారతలో తయారైన వస్తువులే అమ్ముతాం’ అని మరీ బోర్డులు కూడా పెట్టారు.

ఈ దీపావళికి వినియోగదారులు కూడా చైనా వస్తువులకు బదులు స్థానికంగా తయారైన మట్టి ప్రమిదలు,  ప్లాస్టిక్‌తో తయారు చేసిన అలంకరణ వస్తువులతో తమ గృహాలను అలంకరించుకున్నారు.

 చైనా నుంచి దిగుమతయ్యే దీపావళి టపాసులు, పండగ అలంకరణ వస్తువుల విలువ  10 లక్షల డాలర్ల వరకు వుంటుంది. సామాజికమాధ్యమాల ప్రచారం చైనా టపాకాయల బిజినెస్ ను దాదాపుగా తుస్స్ మనేలా చేసింది.

పవన్ కల్యాణ్‌ చీప్ గెస్ట్ గా..



పొందిన సహాయాన్ని మర్చిపోకుండా, కృతజ్ఞతతో ఓ ఆడియో ఫంక్షన్ కి హాజరవబోతున్నాడు పవర్ స్టార్.

కమెడియన్ సప్తగిరి హీరోగా వస్తున్న చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’. ఈ నెల 6 న ఈ సినిమా ఆడియో  విడుదల కాబోతోంది. సాధారణంగా నితిన్ కి తప్ప మరే హీరో ఆడియో ఫంక్షన్ కి వెళ్ళని పవన్ సప్తగిరి సినిమాకు మాత్రం హాజరై పాటల్ని రిలీజ్ చేయబోతున్నాడు

మొదటగా ఈ సినిమాకు ' కాటమరాయుడు ' అనే టైటిల్ ని రిజిస్టర్ చేసారు., కానీ పవన్ ఆ పేరును కోరడంతో పవర్ స్టార్ మీద అభిమానంతో 'సప్తగిరి ఎక్స్ ప్రెస్ ' చిత్ర నిర్మాతలు ఇచ్చేసారు.

ఆ కృతజ్ఞతతో పవన్ ఆడియో ఫంక్షన్ కి రావడానికి ఒప్పుకుని తన పెద్ద మనసును చాటుకున్నాడు.

ఈ సినిమాకు అరుణ్‌ పవార్‌ దర్శకుడు. దీనికి కథానాయకుడైన సప్తగిరి నే స్క్రీన్ ప్లే రాసినట్టు తెలుస్తొంది.

హిల్లరీ - ట్రంప్ హోరాహోరీ..





అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య ఆధిక్యం అనేక మలుపులు తీసుకుంటోంది.

నవంబరు 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.  నిన్నటి వరకు రిప బ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై భారీ ఆధిక్యంలో కొనసాగిన డెమో క్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ తాజా సర్వేల్లో ఒక్కసారిగా దెబ్బతిన్నారు.

 ప్రస్తుతం వస్తున్న అంచనాలను బట్టి ఆమె ట్రంప్ పై ఒక్క శాతం ఓట్ల మెజారిటీతోనే ఉన్నారని తేలింది. దీనికి  కారణం.. ఈ-మెయిల్స్‌ స్కామేనని స్పష్టమైంది. హిల్లరీ తన వ్యక్తిగత సర్వర్‌ ద్వారా అధికారిక కార్యకలాపాలు నిర్వహించిన కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు లభ్యం కావడం..ఈ కేసును తిరిగి విచారించాలని ఎఫ్‌బీఐ నిర్ణయించడంతో హిల్లరీ ఆధిక్యం తగ్గిపోయింది.

ప్రస్తుత సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా మారుతూ వుండటంతో ట్రంప్ అనుకూలురు రెట్టించిన ఉత్సాహంలో వున్నారు.

తారాజువ్వలా గ్యాస్‌ ధర!




వంట గ్యాస్‌ వినియోగదారులకు దీపావళి తర్వాతిరోజు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది.

సబ్సిడీయేతర గ్యాస్‌ ధరను భారీగా పెంచారు. ఒక్కో సిలిండర్‌ మీద ఏకంగా రూ.38.50 పెరిగింది. అదే విధంగా సబ్సిడీ సిలిండర్‌ ధర కూడా రూ.2 పెంచారు. పెరిగిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. మంగళవారం రోజు నాన్‌ సబ్సిడీ సిలిండర్ల బుక్‌ చేసిన వారికి కూడా పెరిగిన ధర వర్తిస్తుంది.