google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU

25, అక్టోబర్ 2016, మంగళవారం

వాహ్ ఏం ఐడియా కామినేనీ..






రాష్ట్రంలోని పేద కుటుంబాలకు  సులభంగా ఇంటికి 20 వేలు వచ్చే ఐడియాని మంత్రి కామినేని శ్రీనివాసరావు కనిపెట్టారు.

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని, ప్రతిపక్షనేత జగన్‌ దోచుకున్న లక్ష కోట్లను రాష్ట్రంలోని పేద కుటుం బాలకు ఇంటికి రూ.20వేల చొప్పున పంచిపెట్టాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు జగన్ ని డి మాండ్‌ చేశారు.

కృష్ణా జిల్లా, చిననందిగామలో సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రభవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.. 

నా సోదరీమణులు ఏం పాపం చేశారు..?!





 మూడు సార్లు తలాక్‌ చెప్పి, ముస్లిం మహిళలకు విడాకులిచ్చే విధానంపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో, మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడారు.

ఈ విధానాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకిస్తూ, తన అబిప్రాయాన్ని తెలియజేసారు. ఈ వివాదాస్పద అంశాన్ని రాజకీయం చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపిచ్చారు.

 ఉత్తరప్రదేశ్‌ లో జరిగిన ‘మహా పరివర్తన్‌ ర్యాలీ’లో మోదీ ప్రసంగిస్తూ.. 'నా ముస్లిం సోదరీమణులు ఏం పాపంచేశారు? కొందరు ఫోన్లోనే తలాక్‌ చెప్పేసి, వారి జీవితాలను నాశనం చేస్తున్నారు’ అని ఆవేదన చెందారు. మూడు సార్లు తలాక్‌ అంశాన్ని హిందూ-ముస్లిం సమస్యగా మార్చవద్దని టీవీ చానళ్లకు విజ్ఞప్తి చేశారు.

 ‘మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు ఉండకూడదని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మతం ఆధారంగా మహిళల పట్ల వివక్ష కూడదని, మూడుసార్లు తలాక్‌ చెప్పి ముస్లిం మహిళల జీవితాలను నాశనం చేయడాన్ని అడ్డుకోవడమే ప్రభుత్వ వైఖరి ' అని, ఆయన తేల్చి చెప్పారు.


24, అక్టోబర్ 2016, సోమవారం

న్యూజిలాండ్ పై సర్జికల్ దాడి!!




'విరాట్ కోహ్లీ రోజూ చేసే పని ఇదే. నిద్ర లేవడం, తినడం, సెంచరీ చేయడం, పడుకోవడం.. ఇదే పని'!! అంటూ  జడేజా  సరదాగా ట్వీట్ చేశాడు. మూడో వండే లో తన వీరోచిత బ్యాటింగ్తో భారత్ ను గెలిపించిన కోహ్లీని, జడేజా పొగడ్తలతో ముంచెత్తాడు.

కోహ్లీ న్యూజిలాండ్ బౌలర్ ట్రెండ్ బౌల్ట్ పై సర్జికల్ దాడి చేసాడని, భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన స్టయిల్లో విరాట్ ను ప్రశంసించాడు.  బౌల్ట్ వేసిన ఒకే ఓవర్లో కొహ్లీ వరుసగా 4, 2, 4, 6, 2,4 పరుగులు చేసి, భారత్ విజయాన్ని సులభతరం చేసాడు.

నిన్నటి వీరోచిత బ్యాటింగ్ చేసిన కోహ్లీ ని ప్రముఖ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు పొగడ్తలతో ముంచెత్తారు. 

ఆయన్ను పిచ్చాసుపత్రిలో చేర్చండి!!



షిర్డీ సాయిబాబా మీద, ద్వారక పీఠాధిపతి స్వరూపానంద చేస్తున్న వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. సవాళ్ళు, ప్రతి సవాళ్లతో ఇరువర్గాలు రేగిపోతున్నాయి.

నిన్న సాయిబాబాను భూతంగా అభివర్ణించిన స్వరూపానందను పిచ్చాసుపత్రిలో చేర్చాలని సాయి భక్తులు డిమాంద్ చేశారు.

 సాయి దేవుడో కాదో తమను చర్చలకు పిలిస్తే, స్వరూపానంద నోరు మూయిస్తామని హైదరాబద్ దిల్‌సుఖ్‌నగర్ సాయి దేవస్థానం పెద్దలు సవాల్ విసిరారు. స్వరూపానందకే బూతం పట్టిందని, షిర్డీ సాయిపై అనుచిత వ్యాఖ్యలుచేస్తే చూస్తూ ఊరుకోమని, వారు హెచ్చరించారు. స్వరూపానందకు దమ్ముంటే తమతో చర్చలకు రావాలని, ద్వారకామయి సాయిబాబా పీఠం సభ్యులు కూడా సవాల్ విసిరారు.

భక్తి శాంతిదాయకం అని అంటారు., కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యి, భక్తి యుద్దకారకం అవుతోంది.

ఎక్కువమంది పిల్లల్ని కనండి!!





తరచూ వివాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలిచే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మతాన్ని కాపాడుకోవడానికి హిందువులంతా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. మతం మనల్ని కాపాడేటప్పుడు, మతాన్ని మనం కాపాడుకోవాలని, అందుకోసం దేశంలోని హిందువులు తమ జనాభాను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

దేశంలో రామభక్తులే లేకపోతే రామాలయం ఎలా కట్టగలుగుతాం' అని, అయోధ్య రామమందిరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రశ్నించారు. సహరాన్‌పూర్ జిల్లా దేవ్‌బాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గిరిరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌లో హిందూ జనాభా 22 శాతం ఉండగా ఇప్పుడు కేవలం ఒక్క శాతమే ఉందనీ, అప్పట్లో ఇండియాలో హిందువుల జనాభా 90 శాతం ఉండగా ఇప్పుడు 76 శాతానికి తగ్గిపోయిందని, 10 శాతంగా ఉన్న ముస్లిం జనాభా ఇప్పుడు 24 శాతానికి పెరిగిందని ఆయన గణాంకాలు వివరించారు.