google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU

9, నవంబర్ 2016, బుధవారం

కరెన్సీ తో సర్జికల్ స్ట్రైక్!!



 
కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన  భారత్.. ఇప్పుడు కరెన్సీ తో మరోసారి స్టైక్స్‌ చేసింది.

రూ 500,1000 నోట్ల రద్దువల్ల పాకిస్థాన్‌ను మాత్రమే కాదు, అక్కడి ఉగ్రవాదులు, మాఫియాను కోలుకోలేని చావుదెబ్బ తీసినట్టైంది.

భారతదేశాన్ని ఆర్థికంగా బలహీనపరచడమే ధ్యేయంగా అక్కడి మాఫియా నకిలీ ఇండియన్‌ కరెన్సీని ముద్రిస్తోంది. మరీ ముఖ్యంగా 1000, 500 నోట్లను ముద్రించడం కోసం దుబాయ్‌లో ఏకంగా ప్రింటింగ్‌ ప్రెస్‌నే ఏర్పాటు చేసింది. దశాబ్దాలుగా అక్కడ ముద్రించిన నోట్లను బంగ్లాదేశ్‌, శ్రీలంక మీదుగా భారతలోకి రవాణా చేస్తోంది.

పాక్ సరిహద్దుల నుంచి భారతలోకి పాకిస్థాన్‌ ఉగ్రవాదులుతో పాటుగా నకిలీ కరెన్సీనీ ని కూడా చొప్పిస్తోంది! ఇలా ప్రతి రోజూ కొన్ని కోట్ల రూపాయలు భారత మార్కెట్లోకి వచ్చి పడుతున్నాయి.

వందల కోట్ల రూపాయల నకిలీ డబ్బు పెరిగిపోవడంతో రూపాయల విలువ పడిపోయి తద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. పాక్ అండదండలతో దావూద్‌ మాఫియా అయితే వందల కోట్ల నకిలీ కరెన్సీ చలామణీ చేస్తోంది.  1000, 500 నోట్ల రద్దుతో ఇప్పుడు ఆ కరెన్సీ మొత్తం రద్దవుతుంది. ఇప్పుడు కొత్త నోట్లను ముద్రించాలంటే పాకిస్థాన్‌ కు భారీగా ఖర్చు అవుతుంది. అందుకు చాలా సమయం శ్రమ పడుతుంది.

దీంతో, ఒక్క దెబ్బతో ఇటు దేశంలోని నల్ల కుబేరులను చావు దెబ్బ తీసిన ప్రధాని మోదీ.. అటు ఉగ్రవాదులు, మాఫియాకూ పూర్తిస్థాయిలో చెక్‌ పెట్టినట్టైంది.

కరెన్సీ నోట్లు ఇలా మార్చుకోండి



500, వెయ్యి నోట్లు చెల్లవని ప్రకటించినందున తక్షణ అవసరాలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది.

ఈనెల 11వ తేదీ రాత్రి 12 గంటల వరకు..
72 గంటలు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాత నోట్లనూ తీసుకుంటారు.
డాక్టర్లు రాసిన మందుల చీటి చూపించి, మెడికల్‌ షాపుల్లో పాత 500, వెయ్యి నోట్లతో ఔషధాలు కొనవచ్చు.
రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు, ప్రభుత్వ బస్‌ టికెట్‌ కౌంటర్లు, విమానాశ్రయాల్లో ఉన్న ఎయిర్‌లైన్‌ టికెట్‌ కౌంటర్లలో 500, 1000 పాత నోట్లు చెల్లుతాయి.

ప్రభుత్వ రంగ సంస్థలు నడిపే పెట్రోలు బంకులు, గ్యాస్‌ స్టేషన్లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల స్టోర్లు, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మిల్క్‌ బూతల్లోనూ 72 గంటలపాటు పాతనోట్లు చెల్లుబాటు అవుతాయి.

జగన్‌ ఎంత షాకయ్యాడో..!




రూ.500, 1000 నోట్లు రద్దవడంతో వైయస్సార్సీపి నేత జగన్మోహన్ రెడ్డి షాక్ కి గురైవుంటాడని టీడీపి ఎంఎల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యంగా అన్నాడు.

'ప్రధాని నరేంద్ర మోదీ రూ. 500, 100 నోట్లు రద్దు నిర్ణయం వినగానే నేను షాకయ్యాను. వెంటనే నా బీరువా తీసి చూసుకుంటే, 26 వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి. వాటిని ఎలా మార్చాలా అని ఆందోళన పడిపోయాను. నేనే ఈ రకంగా ఆందోళన చెందితే.. సోదరుడు జగన్‌ మోహన్‌రెడ్డి ఎంతగా ఆందోళన చెందివుంటాడో.. బెంగళూరు వైట్‌ హౌస్‌ అండర్ గ్రౌండ్లో ఉన్న డబ్బును ఏం చేయాలో తెలియక షాకై ఉంటాడు" అని అన్నాడు.

చంద్రబాబు ఎప్పటినుంచో వెయ్యి, 500 నోట్లు రద్దు చేయాలని చెబుతున్నారు.ఈ కీలక నిర్ణయంలో చంద్రబాబు ప్రభావం చాలా వుంది ఉంది., దటీజ్‌ చంద్రబాబు. అని సోమిరెడ్డి వ్యాఖ్యానించాడు.

8, నవంబర్ 2016, మంగళవారం

కరెన్సీ నోట్లపై మోది సంచలన నిర్ణయం!




నేటి అర్ధరాత్రి నుంచి అంటే నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి 500, వెయ్యిరూపాయల నోట్లు చెలామణిలో ఉండవని ప్రధానమంత్రి ప్రకటించారు.

ప్రజలు తమ వద్ద ఉన్న 500, వెయ్యి నోట్లు మార్చుకునేందుకు 50 రోజుల గడువు వుంటుంది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకూ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో ప్రజలు తమ దగ్గరున్న 500, 1000 నోట్లు మార్చుకునే వీలుంది.

నల్లధనాన్ని నియంత్రించేందుకే ప్రధాని ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇదేనా రాంచరణ్ మూవీ టైటిల్..?





ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమాకు 'నాన్నకు ప్రేమతో' అనే టైటిల్ పెట్టిన డైరక్టర్ సుకుమార్, తను నిర్మాతగా తెరకెక్కించిన సినిమాకు 'కుమారి 21ఎఫ్ అనే టైటిల్' ను పెట్టి మంచి విజయం సాధించాడు.

అదే విధంగా త్వరలో తన డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించబోయే సినిమాకు 'ఫేస్ బుక్ లైవ్ చాట్ ఎట్ 8.18 పియం' అనే వెరైటీ టైటిల్ ను పెట్టాలని అనుకుంటున్నాడట.

ఇంకా అఫీషియల్  గా మాత్రం ఎనౌన్స్ మెంట్ లేకపోయినా టైటిల్ ఇదే అని అనుకుంటున్నారు.

కానీ టైటిల్ వెరైటీగా వున్నప్పటికీ క్యాచీ గా లేదని అభిమానులు అసంతృప్తిగా వున్నట్టు బోగట్టా.