google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU

10, నవంబర్ 2016, గురువారం

చంద్రబాబూ.. డబ్బా కొట్టుకోవడం ఆపు!!




రూ.వెయ్యి, 500 నోట్ల రద్దుకు తానే సిఫార్స్ చేశానని చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకుంటున్నారని వైయస్సార్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎద్దేవా చేశాడు.

ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిన ఏకైక వ్యక్తి చంద్రబాబే అని మేకపాటి ధ్వజమెత్తారు. తన పరిపాలనా లోపాల్ని పక్కదారి పట్టించడానికి, నోట్ల రద్దును తన గొప్పతనంగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని మేకపాటి విమర్శించాడు.

కరెన్సీనోట్లను కాల్చేస్తున్నారు!



రూ.500, 1000 నోట్ల రద్దు నిర్ణయం నల్లకుభేరుల్ని కోలుకోలేనంత దెబ్బ తీస్తున్నట్టు కనిపిస్తోంది. మార్చుకునే వీలులేక, దగ్గరుంచుకుంటే ఉపయోగం లేకపోవడంతో కొంతమంది నోట్లను పెద్దమొత్తాలో తగలబెట్టేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో గోతాల్లో నింపి తగలబెట్టిన రూ.1000, రూ.500 నోట్లను  గుర్తించారు. సీబీ గంజ్‌లోని పర్సా ఖేడా రోడ్‌లో గోతాల్లో వేసి మసి అయిపోతున్న కరెన్సీ కట్టలను కనుగొన్నారు.

ఓ పెద్ద కంపెనీకి చెందిన ఆ నోట్లను ముందుగా ముక్కలు చేసి, తర్వాత  తగలబెట్టారని పోలీసులు తెలిపారు. 

టాటా సన్స్‌కి చైర్మెన్ ఇషాత్ హుస్సేన్




ఇటీవల టాటా సన్స్ బోర్డు అనూహ్యంగా చైర్మన్ పదవి నుంచి ఉద్వాసన పలికిన సైరస్ పల్లోంజీ మిస్త్రీ స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా ఇషాత్ హుస్సేన్ నియమితులయ్యారు.

టాటా సన్స్ కొత్త చైర్మన్‌ను నియమించేవరకు హుస్సేన్ టాటా సన్స్‌కు తాత్కాలికంగా సారథ్యం వహించనున్నారు.

1999లో టాటా సన్స్ బోర్డులోకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అడుగుపెట్టిన ఇషాత్ హుస్సేన్, టా ఇండస్ట్రీస్, టాటా స్టీల్   కంపెనీలకు హుస్సేన్ డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే వోల్టాస్, టాటా స్కై కంపెనీలకు చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

గుడ్డ్లు కొనడానికి అప్పు చేసిన హీరోయిన్‌!



పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తూనే వుంది.

అయితే సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ బిపాసాబసు కూడా ఇబ్బందిని ఎదుర్కొంది. బిపాసాబసు వద్ద కోడిగుడ్లు కొనుక్కోవడానికి చిల్లర లేకపోవడంతో రాకీస్టార్ దగ్గర అప్పుచేసి మరీ కొన్నదట.!

 ‘కోడిగుడ్లు కొనుగోలు చేసేందుకు ఇప్పుడే రాకీ స్టార్‌ దగ్గర్నుంచి చిల్లర డబ్బులు అప్పు తీసుకున్నా. మొదటి రోజు ఇలా గడిచింది’ అంటూ బిపాసాబసు తన ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.


9, నవంబర్ 2016, బుధవారం

ట్రంప్ గెలుపుకు వర్మ ట్రీట్!



అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ గెలవడంతో.. రాంగోపాల్ వర్మ పెద్ద ఎత్తున పార్టీ ఇవ్వబోతున్నాడట.

''నాలుగు నెలల క్రితమే ట్రంప్ గెలుస్తాడని నేను చెప్పాను. అందుకే నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈరోజు రాత్రికి అందరికీ పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాను. ట్రంప్ ను నాన్ సెన్స్ అనుకున్నవారందరూ ఇప్పుడు వారే నాన్ సెన్స్ మాట్లాడారని అనుకోవచ్చు మనం'' అంటూ ట్వీట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ.

మాటలే కాదు, తన చేష్టలు కూడా విలక్షణంగా వుంటాయని వర్మ మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు.