google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU

24, నవంబర్ 2016, గురువారం

మోదీకి మాయావతి సవాల్!



పెద్ద నోట్ల రద్దుపై 92 శాతం ప్రజలు మద్దతిచ్చారని ప్రధాని చెబుతున్నారని, అదే నిజమయితే లోక్‌సభను తక్షణం రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని, అప్పుడు మోదీకి మద్దతుగా ఎంతమంది ఉన్నారో తేలిపోతుందని బీ.యస్.పీ నేత మాయవతి సవాల్‌ విసిరింది.

ముందుగా ప్రణాళిక లేకుండా పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని  ఆమె ఆరోపించింది.

దమ్ముంటే లోక్ సభను రద్దుచేసి ఎన్నికలకు వెళితే, ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎంత ఉందో తేలిపోతుంధని ఆమె సవాల్ విసిరింది.

గురువారం రాజ్యసభలో నోట్ల రద్దుపై చర్చలో భాగంగా మాయవతి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేయించిన సర్వే బూటకమని  తీవ్రస్థాయిలో విమర్శించింది.

17, నవంబర్ 2016, గురువారం

టోల్ ప్లాజా చార్జీలు వాయిదా




నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజా చార్జీల విషయంలో ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 24 వరకూ జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదని తెలిపింది.

 వాస్తవానికి ఇది రేపటితో ముగియాల్సి ఉంది. వాహనదారులు చిల్లర కోసం ఇబ్బందులు పడుతుండటంతో పాటు టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

నోట్ల రద్దుకి బిల్ గేట్స్ మద్దతు




పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదేనని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నాడు.

ఈ చర్య వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని అభిప్రాయ పడ్డారు.
‘నీతి లెక్చర్స్ సిరీస్ : పరివర్తన చెందుతున్న భారతదేశం’ అనే అంశంపై జరిగిన సదస్సులో బిల్ గేట్స్ మాట్లాడుతూ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడాన్ని సమర్థించారు.

ఈ పరిణామం వల్ల రాబోయే కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయన్నారు. డిజిటలైజేషన్ జరిగిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశం రూపొందుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు పాల్గొన్నారు.

2.0.. పోస్టర్ విడుదల


 
 సూపర్ హిట్ 'రోబో' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న 'రోబో 2.0' మూవీ కి సంబందించి పోస్టర్ ను సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

సాంకేతికంగా గొప్ప సెన్సేషన్ క్రియేట్ చేసిన రోబో మూవీ రెండవ భాగం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దాదాపుగా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నవంబర్ 20న విడుదల చేయనున్నారు.

బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న ఈ పోస్టర్‌పై  హీరో పేరుతో పాటు విలన్ అక్షయ్ కుమార్ పేరు కూడా వేశారు. 

మల్లికాశెరావత్ పై దాడి!!



ప్రముఖ మోడల్‌, బాలీవుడ్‌ నటి మల్లికా శెరావత్‌పై ఫ్రాన్స్‌లో దాడి జరిగింది.

పారీస్ నగరంలోని ఉన్న ఆమె సొంత అపార్ట్‌మెంట్‌లో ఈ దారుణం జరిగింది. ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు  ఆమెమీద టియర్‌ గ్యాస్‌‌ వదిలి భౌతికదాడి చేశారు.

దాడి జరిగిన సమయంలో ఆమె స్నేహితుడైన ఫ్రెంచి వ్యాపారవేత్త లొవెర్ సిరిల్ అక్సెన్‌ఫాన్స్ కూడా మల్లిక తో వున్నాడు. తీవ్రగాయాలతో ఉన్న మల్లిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది.

దొంగతనం చేయడానికి వచ్చి, ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని  పోలీసులు భావిస్తున్నారు.