ఇప్పటికే బలూచిస్తాన్ విముక్తి కోసం జరుగుతున్న ఆందోళనతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతుండగా తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ అకృత్యాలను నిరశిస్తూ, పాకిస్తాన్ పాలన నుంచి విముక్తి కావాలంటూ నినదించారు.
పాకిస్తాన్‌లో ఉండడానికి ఇష్టపడకుండా, ఆజాదీ కోరుకుంటున్న నేతలపై ఎలాంటి న్యాయవిచారణ జరపకుండానే హత్యలు చేస్తుండటం, ఉద్యమకారులపై అమానుషకాండలకు నిరసనగా ఈ ప్రదర్శనలు నిర్వహించారు.
' కసాయి పాకిస్తాన్ ఆర్మీ', 'ఐఎస్ఐ కంటే కుక్కలకే విశ్వాసం ఎక్కువ' అనే నినాదాలతో ప్రదర్శకులు ప్లేకార్డులు ప్రదర్శించారు. ఉద్యమసంస్థల లెక్కల ప్రకారం, గత రెండేళ్లలో 100 మందికి రాజకీయ కార్యకర్తలనుపాక్ ప్రేరేపిత ఐఎస్ఐ హత్య చేసింది.
ఇలా బెలూచిస్థాన్లో, పీఓకే లో వ్యతిరేక ప్రదర్శనలు ముమ్మరం అవుతూండడంతో పాక్ కి దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి