తరచూ తన దగ్గర డబ్బులు లేవని, ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవడానికే సినిమాలు చేస్తున్నాని చెప్పే పవర్ స్టార్ మాటల్లో నిజం ఎంతుందో గానీ,
మామూలుగా ఒక సినిమా పూర్తయ్యాక ఇంకో సినిమా మొదలెట్టడానికి చాలా గాప్ తీసుకునే పవన్ కళ్యాన్ స్పీడ్ పెంచాడు
''సర్దార్'' సినిమా తరువాత పవన్ చాలా ఫాస్టుగా మూడు నెలల్లో తన కొత్త సినిమా ''కాటంరాయుడు'' ను మొదలెట్టేసిన పవన్ అక్కడితో ఆగకుండా, ఆ షూటింగ్ లో వుండగానే మరో కొత్త సినిమా కూడా మొదలెట్టాడు.
తమిళ మూవీ ''జిల్లా'' మూవీ ఫేం దర్శకుడు ఆర్.టి.నీసన్ చెప్పిన కథ పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చేయడంతో ఆ సినిమాను చెయ్యడానికి పవన్ ఒప్పుకున్నాడు. ఈ సినిమాకు ఒకప్పుడు సెన్షేషన్ నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మాన భాధ్యతలు వహిస్తున్నాడు.
ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. కాబట్టి వచ్చే సంవత్సరం పవర్ స్టార్ అభిమానులకు డబుల్ డమాకా అనిపిస్తోంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి