ఈరోజు సాయంత్రం 5 గంటలకు తన మూవీ వంగవీటికి సంబంధించిన కొన్ని ధృవ తారల్లాంటి మామూలు షూట్లు నెట్‌లో పెడుతున్నట్లు దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించాడు.
అక్టోబర్ 2న విడుదల చేసిన ‘వంగవీటి’ ట్రైలర్ ని లక్షలాది మంది వీక్షించారు. బెజవాడ రాజకీయ నాయకుడు స్వర్గీయ వంగవీటి రంగా జీవితకథ ఆధారంగా వర్మ తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఒక్క సినిమా రంగమే కాకుండా రాజకీయ నేతలు కూడా ఈ సినిమా ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వర్మ ఈ మూవీ షూట్ల విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. నాస్తికుడినని చెప్పే వర్మ దుర్గమ్మ ఆశీస్సులు కావాలని ఇదే ప్రకటనలో చెప్పాడు.
దీంతో ట్రైలర్ చూసిన వర్మ అభిమానులంతా ఈ షూట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి