google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: సాక్షి పై 420 కేసు

12, అక్టోబర్ 2016, బుధవారం

సాక్షి పై 420 కేసు



 కోట్ల రూపాయల మోసానికి చెందిన ఒక కేసులో టీమిండియా  కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి తో పాటు   మరో ముగ్గిరిపై ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు బుక్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 గుర్‌గ్రామ్‌లోని  నివాసముంటున్న డెన్నీస్ అరోరా వీరిపై ఫిర్యాదు చేశారు.

 సాక్షి కోడైరెక్టర్ గా వున్న ‘రితి ఎమ్మెస్‌డి అల్మోడ్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీకు స్పోర్ట్స్‌ ఫిట్ వరల్డ్, ఒక జిమ్ కమ్ ఫిట్‌నెస్ సెంటర్‌  ఉన్నాయి.

 స్పోర్ట్స్ ఫిట్‌లో డెన్నీస్ అరోరా కూడా ఒక కో-డైరెక్టర్‌గా ఉన్నారు. ఇందులో డెన్నీస్ తండ్రి కి 39 శాతం షేర్లు ఉన్నాయి. ఈ షేర్ల ను కొనాలని సదరు కంపెనీ నిర్ణయించుకుంది. ఈ వ్యవహారంలో బాగంగా తమకు  సుమారుగా 11 కోట్లు చెల్లించాల్సి ఉందని, కానీ 2.25 కోట్లు మాత్రమే చెల్లించారని, మార్చి 31 డెడ్‌లైన్ అయినప్పటికీ డబ్బులు చెల్లించడంలేదని  డెన్నీస్ అరోరా పోలీసులకు పిర్యాదు చేసాడు.

కానీ వికాస్ అరోరా తమకు బదిలీ చేసిన షేర్లకు సరిపడా నగదు మొత్తాన్ని  తాము చెల్లించామని కో-డైరెక్టర్లలో ఒకరైన అరుణ్ పాండే అంటున్నారు. అంతే కాకుండా ఏడాది క్రితమే సాక్షి కంపెనీను వదిలి వెళ్లిపోయారని, ఆమెపై కేసు నమోదు చేయడం భావ్యం కాదని చెప్పారు. అయితే ఈ విషయంపై సాక్షి ఇంతవరకూ స్పందించలేదు.

పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి