దమ్ముంటే పాక్ పై యుద్దానికి రావాలని సంచలన్ ప్రకటన చేసిన పాక్ వెటరన్ క్రికెటర్ జావీద్ మియాందాద్ గూబ పగిలేలా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడు అనురాగ్ ఠాగూర్ సమాధానం ఇచ్చాడు.
యుద్దమైనా, క్రికెటైనా అంతిమ విజయం భారత్ దేననీ, కావాలంటే చరిత్ర చదువుకోమనీ, ఇప్పటివరకు భారత్ తో జరిగిన యుద్దాల్లో పాక్ చిత్తుగా ఓడిందనీ, ముందుగా ఆ విషయం తెలుసుకుని మాట్లాడితే మంచిదనీ దెప్పిపొడిచాడు.
అంతేకాకుండా, పాక్ సైన్యం మీద అంత నమ్మకం వుంటే, తమ దేశంలోనే వున్న, దావూద్ ఇబ్రహీంని ఇండియాకు పంపించి చూడాలని సవాల్ విసిరాడు.
అనురాగ్ ఠాగూర్ బాజాపా ఎంపీ కూడా.
ఇదిలా వుంటే, మియాందాద్ తన క్రీడాజీవితం మొత్తం అత్యంత వివాదాస్పద క్రికెటర్ గా గుర్తింపుపొందాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి