నిన్న భారతసైనికుల మీద నోరుపారేసుకుని, తన అహంకారాన్ని చాటుకున్న బాలీవుడ్ నటుడు ఓంపురి, దేశవ్యాపతంగా నిరసన, ఆగ్రహజ్వాలలలు రేగడంతో క్షమాపణలు తెలియజేశాడు.!
ఉరి సంఘటనలో ప్రానాలు కోల్పోయిన సైనికుల్ని ఉద్దేశించి, 'అసలు వాళ్ళను ఎవరు సైన్యంలో చేరమన్నారు, ఎవరు ఆయుధాలు పట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకోమన్నారు '?! లాంటి వెకిలిమాటలు మాట్లాడ్డంతో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది.,
దాంతో మేలుకున్న ఓంపురి " నోటికొచ్చినట్టు వాగేసాను, ఇప్పుడు క్షమించమని అడగడం వల్ల లాభంలేదు, కానీ సైనికులు నన్ను మన్నించమని వేడుకుంటున్నాను" అని ఓ విలేఖరుల సమావేశంలో తెలియజేసాడు.
అవగాహనారాహిత్యంతో నోటికొచ్చిన వ్యాఖ్యానాలు చెయ్యడం, తర్వాత, క్షమాపణలు కోరడం అనేది ఈ మధ్య ప్రముఖులకు మామూలైపోయింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి