google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: రాధిక ఆప్టే కేరాఫ్ సంచలనం

5, అక్టోబర్ 2016, బుధవారం

రాధిక ఆప్టే కేరాఫ్ సంచలనం



పర్చేడ్ సినిమాలో తను నటించిన నగ్న సన్నివేశాలు లీక్ అవడంతో, సంచలనం సృష్టించిన రాధిక ఆప్టే, తాజాగా, నిన్న జరిగిన ఓ ఇంటర్వ్యూలో విలేఖరి మీద కోపంతో చిందులేసి, హాట్ టాపిక్ క్రియేట్ చేసింది.

వివాదాలు సృష్టించేలా ఎందుకు ప్రవర్తిస్తారు అని అడిగిన ప్రశ్నకు, అసలు వివాదాలు సృష్టించేది మీడియానేనని, తను సంచలనాలకోసం ఏదీ చేయననీ, కానీ ఒక నటిగా పాత్రలో ఒదిగిపోవడానికి, ఎలాంటి సాహసానికైనా వెనుకాడననీ, అలాంటి విషయాల్ని ప్రేక్షకులు, మీడియా, మరోలా అర్థం చేసుకుని, వివాదాల్ని మొదలుపెడ్తుంటారని తెలియజేసింది.

ప్రేక్షకులు ఎదుటివారి శరీరాన్ని చూడటానికి ఆసక్తి చూపిస్తారని, తనదికూదా అలాంటి ఆసక్తికరమైన శరీరమైనందుకు తనకెంతో గర్వంగా వుందనీ ఆప్టే చెప్పుకొచ్చింది.

వివాదం రేకెత్తించిన పర్చేడ్ నగ్న దృశాన్ని గురించి చెబుతూ, అసలది శృంగార సన్నివేశం కానే కాదని, నిజానికి చెప్పాలంటే అదొక కామెడీ సీన్ అనీ ఆప్టే నవ్వుతూ వివరించింది.

ముందునుంచీ, సామాజిక మీడియాలలో తన  సెల్ఫీలతో, ఘాటైన వ్యాఖ్యలతో సంచలన వార్తలను సృష్టించడం రాధిక ఆప్టేకి మామూలే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి