google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఎంత ఘాటు ప్రేమయో కదా..?

5, అక్టోబర్ 2016, బుధవారం

ఎంత ఘాటు ప్రేమయో కదా..?



ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే పుట్టి, పెరిగిన తెలంగాణా సీ.యం. కేసీఆర్ చాలా రోజులతర్వాత అన్న యన్.టీ. ఆర్. మీద తన అభిమానాన్ని గుర్తుచేసాడు!

జిల్లాల విభజన సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ, పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న చిన్న భాగాలుగా చేసుకోవడమనే ఆలోచన యన్.టీ.ఆర్ దగ్గరనుండి నేర్చుకున్నదే అని తెలియజేసాడు.

ఒకప్పుడు అన్న రూపొందించిన మండల విభజనకమిటీ లో తానుకూడా సభ్యుడినని తెలియజేసాడు. ఉమ్మడిరాష్ట్రంగా వున్నపుడు ఈ విభజన విధానం వల్ల అప్పట్లో  పరిపాలన ఎంతో సులభతరం ఐందని, కే.సీ.ఆర్. చెప్పాడు.

చంద్రబాబుతో పొసగక బయటకొచ్చేసి, ఆనక టీ.ఆర్.యస్. స్థాపించి, తద్వారా, రాష్ట్రసాధన, అనంతరం అధికారాన్ని చేపట్టిన కేసీఆర్, నందమూరి తారకరామారావు కి మంచి అభిమాని. అందుకనే తన కొడుక్కి ఆ పేరే పెట్టాడని చెబుతుంటారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి