google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: రోహిత్ దళితుడు కాదు??

6, అక్టోబర్ 2016, గురువారం

రోహిత్ దళితుడు కాదు??


కొద్దినెలల క్రితం దేశవ్యాప్తంగా సంచలనాన్ని, వివాదాల్ని సృష్టించిన సెంట్రల్‌ యూనిర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఎపిసోడ్ మరో అంకానికి తెర తీసింది.

ఈ వివాదాన్ని పరిష్కరిండానికి కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ రూపన్ వాలా కమీషన్ కేంద్రానికి తమ నివేదిక సమర్పించింది.

రోహిత్ మరణానంతరం చర్చలకు గొడవలకు దారితీసిన కులనిర్ధారణ గురించి, ఆత్మహత్య గురించి, కమిషన్ తమ అభిప్రాయాల్ని తెలియజేసింది.

రోహిత్ తల్లి దళితురాలు అనడానికి సాక్ష్యాలు ఏమీ లేవని, రోహిత్ వేముల దళితుడు కాదని కమిషన్  తేల్చి చెప్పింది.

 అలాగే ఈ కేసులో ఆరోపనలు ఎదుర్కొంటున్న  కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయకు కమిషన్ క్లీన్ చిట్‌ ఇచ్చింది.

వ్యక్తిగత కారణాలతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ కేసు విషయంలో కమిషన్ యూనివర్శిటీ అధికారులకు కూడా క్లీన్ చిట్‌ ఇచ్చింది. యూనివర్శిటీ అధికారులు ఎవరూ రాజకీయ వత్తిడులకు లొంగి పనిచేయలేదని స్పష్టం చేసింది.

రోహిత్ ఆత్మహత్య చేసుకోడానికి కేంద్రమంత్రి దత్తాత్రేయ, వీసీ అప్పారావు వైఖరే కారణమని కొంతమంది విద్యార్థులు అప్పట్లో ఆరోపించగా, కమిషన్ ఆ ఆరోపణలను కొట్టిపారేసింది.  వ్యక్తిగత కారణాలవల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఈ విషయంలో ఎవరినీ నిందించలేమని, రాజకీయ వత్తిడులు ఏవీ లేవని, రూపన్వాలా కమిషన్ మానవవనరులశాఖకు, చెప్పింది.

అలాగే కమిషన్ కొన్ని సూచనలు కూడా చేసింది.
సెంట్రల్‌ వర్శిటీలో విద్యార్థులు రీసెర్చ్‌ స్కాలర్స్‌ కోసం కౌన్సిలింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని   భవిష్యత్‌లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.

రోహిత్ ఆత్మహత్యపై న్యాయ విచారణ చేపట్టాలంటూ గతంలో వర్శిటీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో  కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ విశ్రాంత న్యాయమూర్తి రూపన్ వాలాతో కమిషన్ వేసింది.

కేంద్రమంత్రులకు క్లీన్ చిట్, రోహిత్ దళితుడుకాదని, ఇచ్చిన కమీషన్ నివేదికమీద నిరశనలు, వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి