google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: పన్నెర్ సెల్వం మళ్ళీ

13, అక్టోబర్ 2016, గురువారం

పన్నెర్ సెల్వం మళ్ళీ





గత 20 రోజులకు పైగా తీవ్ర అనారోగ్యంతో, హాస్పిట్ల్ నుంచి కదల్లేని పరిస్థితుల్లో వున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకి ఆపద్ధర్మంగా పరిపాలన కొనసాగడానికి వీలుగా ఎట్టకేలకు  ‘అమ్మ’ శాఖల్ని మొత్తం నమ్మినబంటు ఒ.పన్నీర్‌సెల్వానికి అప్పగించారు

 సీఎం జయలలిత మళ్లీ విధులు చేపట్టే వరకు ఆమె శాఖల్ని పన్నీర్‌సెల్వం చూసుకుంటారని రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ప్రకటించారు. జయ  మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు పన్నీర్‌సెల్వానికి అప్పగిస్తున్నట్లు గవర్నర్‌ పేర్కొన్నారు.

కానీ ట్విస్ట్ ఏమిటంటే, జయ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ చెప్పడం!!

ఇలా గవర్నర్ ప్రకటించడం పట్ల డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి పలు సందేహాలు లేవనెత్తారు. . ‘‘శాఖల అప్పగింతపై జయ ఏదైనా ఫైలుపై సంతకం చేశారా? కనీసం ఆమె ఫోన్ చేసి ఏమైనా గవర్నర్‌కు చెప్పారా?’’ అని కరుణ ప్రశ్నించారు.

 కాగా జయ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు తిరిగి వైద్యనిపుణుడు డాక్టర్‌ జాన్‌ రిచర్డ్‌ బిలే గురువారం లండన్ నుంచి చెన్నై రానున్నారు.

 మరోవైపు జయ ఆరోగ్యంపై ఫేస్బుక్‌, ట్విటర్‌లో వదంతులు సృష్టిస్తున్నారన్న నెపంతో మరో 10మందిపై కేసు నమోదు చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి