ఆదాయం వెల్లడించిన వారి పేర్లను బయటకు చెప్పబోమని సీబీడీటీ స్పష్టం చేసిందని, అయినా ఏపీ సీఎం చంద్రబాబు కొందరి పేర్లు ఎలా బయటపెట్ట గలిగారని, వైకాపా నేత జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఒకరు రూ.10వేల కోట్లు నల్లధనాన్ని వెల్లడించారని చంద్రబాబు చెప్పారని, ఆ వివరాలు ఆయనకు ఎలా తెలిశాయని ప్రశ్నించారు. చంద్రబాబు కచ్చితంగా లెక్క చెబుతున్నారంటే, నల్లధనం వెల్లడించిన వ్యక్తి ఎవరో ఆయనకు తెలుసనీ, బహుశా అతను బాబుకు బినామీ అయి ఉండొచ్చని జగన్ అనుమానం వ్యక్తం చేశారు.
నల్లధనం వెల్లడించిన అందరి పేర్లూ బయటపెట్టాలని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి, ఓ లేఖ రాశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి