చిరు 150 మూవీ నుంచి క్యాథరిన్ ని తీసేసారు!
షూటింగ్ లో డాన్స్ మాస్ట్ర్ లారెన్స్ తో గొడవ పెట్టుకున్న కారణంతో ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తున్న కాథరిన్ ను ప్రక్కకు నెట్టేసి, ఆమె స్థానంలో మరో నటి లక్ష్మీరాయ్ ని తీసుకున్నారట.
మెగాస్టార్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ఖైదీ నెం. 150' కొద్ది నెలలుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.
నిజానికి క్యాథరిన్ కి డాన్సర్ గా మంచి పేరేమి లేదు. అయితే సరైనోడు సినిమాలో అల్లుఅర్జున్ తో నటించినందుకుగాను పిలిచిమరీ ఈ అవకాశం ఇచ్చినట్టు తెలిసింది. లారెన్స్ చిరుకి చాలా క్లోజ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన కాస్ట్యూమ్స్ వేసుకోకుండా ఆయన చెప్పిన స్టెప్పులను ప్రాక్టీస్ చేయకుండా షూటింగ్ ను డిలేచేయడంతో ఆమెను తీసేశారని అంటున్నారు.
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదనే సామెత క్యాథరిన్ కు సరిగా సరిపోయినట్టుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి