1000, 500 రూపాయల నోట్లను రద్దుచేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు లేఖ రాశారు.
బ్లాక్ మనీ ని అదుపు చెయ్యాలంటే వెయ్యి, ఐదువందల రూపాల నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు తన అభిప్రాయం ప్రధానికి తెలియజేసారు. నగదు రహిత కొనుగోళ్లను ప్రోత్సహించడంవల్ల డిజిటల్ ఇండియా రూపుదిద్దుకుంటుందని లేఖలో చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
చాలా రోజులనుంచీ వెయ్యి, ఐదొందలనోట్లను రద్దు చెయ్యాలనే వాదనకు మద్దతిస్తున్న చంద్రబాబు నల్లధనంపై ప్రధానికి లేఖ రాసిన ముఖ్యమంత్రుల్లో మొదటివారు కావడం గమనార్హం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి