చిరంజీవి, రాఘవ లారెన్స కాంబినేషన్లో ‘దాయి దాయి దామ్మా.. కులికే కుందనాల కొమ్మా’ , ‘కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ’ వంటి పాటలు చిరంజీవి అభిమానుల్ని ఎలా వుర్రూతలూగించాయో మనకు తెలుసు.
మళ్లీ ఇన్నాళ్లకు లారెన్స కొరియోగ్రఫీలో చిరంజీవి స్టెప్పులేస్తున్నాడు . ‘ఖైదీ నంబర్ 150’ సినిమా కోసం చిరంజీవి, రాయ్ లక్ష్మీపై ఓ పాటను లారెన్స్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యాన్నీ కూడా సమకూర్చడం విశేషం.
చాలారోజుల తర్వాత చిరు మూవీ కావడం, లారెన్స్ కూడా మెగాస్టార్ కోసం ప్రత్యేక శ్రద్దతో డాన్స్ కంపోజింగ్ చేస్తున్నట్టు తెలిసింది. అందుకోసం లారెన్స్ మళ్ళీ తనకూ, చిరుకూ పేరు తెచ్చిన సెన్షేషన్ వీణ స్టెప్ ను ఇంకాస్త వెరైటీగా వేయిస్తున్నట్టు తెలిసింది.
ఇన్నాళ్ళకు రాబోతున్న మెగాస్టార్ మూవీలో డాన్స్ ఎలావుంటుందో అని, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు., మరి లారెన్స్ అభిమానుల ఆశల్ని ఎంతవరకు నిలబెడుతాడో చూడాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి