తమ లౌకికతత్వాన్ని చాటుకోవడానికి కొందరు ప్రముఖులు సమయం సంధర్భం లేకుండా స్టేట్ మెంట్లు ఇచ్చేసి చిక్కుల్లో పడిపోతుంటారు. తర్వాత తీరిగ్గా తమ ఉద్దేశం అదికాదు, అందుకు అనలేదు, అపార్థం చేసుకున్నారు అని ముక్తాయిస్తుంటారు.
సరిగ్గా అలాంటిదే బాలీవుడ్ హీరొ సల్మాన్ ఖాన్ మళ్ళీ చేసాడు., పాకిస్థాన్ కళాకారుల పట్ల అతను చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.
గత కొద్దిరోజులుగా భారత్ పాక్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల, ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దేశం లోని పాకిస్థాన్ కళాకారుల్ని నిషేధించిన విషయం తెలిసిందే.
కాగా కళకు మతం లేదని, పాకిస్తాన్ కళాకారులు నటులుమాత్రమేనని, తీవ్రవాదులు కారని, వారి నిషేధం సబబు కాదని అన్నరీతిలో మాట్లాడిన సల్మాన్ వ్యాఖ్యల పట్ల దేశంలో పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తుతోంది.
నిజానికి, సల్మాన్ మనసులో మరొక అభిప్రాయం వుండొచ్చు కానీ, సరిహద్దుల్లో యుద్దవాతావరణం ఏర్పడిన ఈ సమయంలో ఇలంటి స్టేట్ మెంట్లు ప్రజల మనసుల్లో భావోద్వేగాలను రెచ్చకొట్టే ప్రమాదం వుంది.
పాకిస్తాన్లో తన సినిమాల బిజినెస్ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసుకునేందుకే సల్మాన్ ఇలా అంటున్నారని చాలామంది భావిస్తున్నారు.
కాగా శివసేన నాయకుడు రాజ్ థాకరే సల్మాన్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డాడు.
పాకిస్తాన్ అంటే అంత అభిమానం వున్నపుడు అక్కడికే వెళ్ళి బ్రతకొచ్చుకదా అని సూచించాడు
కాబట్టి, ఏదైనా అభిప్రాయాల్ని వెల్లడించే ముందు ఎవరైనా కాస్త ముందూ వెనుకా అలోచిస్తే బాగుంటుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి