సీమాంధ్రుల ఆత్మగౌరవసభ పేరుతో వేలాది అభిమానుల మధ్య కాకినాడలో హల్ చల్ చేసిన పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? త్వరలోనే కార్యాచరణ వుంటుందని, అవసరమైనపుడు రంగంలోకి దిగుతానని హెచ్చరించిన పవర్ స్టార్ ఎలాంటి ప్రణాలిక వేస్తున్నాడు?
నిజంగానే సీమాంధ్రుల తరపున పెద్దేత్తున ఉధ్యమం లాంటిది చెయ్యబోతున్నాడా, లేక ' అవసరం ' ఇంకా రాలేదని వేచి చూస్తున్నాడా?
ఎందుకంటే, కాకినాడసభ జరుగుతూన్న సమయంలోనే కేంద్రప్రభుత్వం ప్యాకేజీని ముందుకు తీసుకురావడం జరిగింది. దానిగురించి ఇంతవరకు పవన్ తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పలేదు.
కేంద్రం మొదట ప్రత్యేకహోదా వుండబోదని సుతిమెత్తగా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసి, దానికి సమానంగా ప్యాకేజి వుంటుందని తెలియజేస్తూ వచ్చింది.
ప్రజల్లో ఊహించినంత వ్యతిరేఖత వ్యక్తం కాకపోతూవుండటంతో తర్వాత సూటిగా ప్రతేకహోదా అస్సలు కుదరదని, ప్యాకేజీ మాత్రమే ఇవ్వగలమని తేల్చి చెప్పేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, ప్రతిఘటించకుండానే, ప్యాకేజికి చట్టబద్దత కల్పిస్తే చాలన్న డిమాండ్ తో సర్దుకుపోతున్నట్టే కనిపిస్తోంది.
లోటు బడ్జెట్, ఆర్థికసమస్యలు, రాజకీయపరమైన అనేక అవసరాల దృష్ట్యా చంద్రబాబు మంత్రివర్గం కూడా ప్యాకేజిని పెద్దగా వ్యతిరేకించకుండానే ఆమోదించింది.
అప్పుడప్పుడూ కమ్యూనిస్ట్ నాయకులూ, రఘువీరారెడ్డి, హీరో శివాజీ, ప్రతిపక్షనాయకుడు జగన్ తమ వ్యతిరేఖతను వ్యక్తం చేస్తున్నా, అవేవీ ప్రజల్ని పూర్తిస్థాయిలో కదిలించలేక పోతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ఏం చెయ్యబొతున్నారనేది సందేహంగా మిగులుతోంది. ప్రత్యేకహోదా కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చెయ్యడానికి ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నాడా, ఇందుకోసం తన అభిమానులు, సహచరులతో ఏదైనా మంతనాలు చర్చలు జరుపుతున్నాడా అనేది తెలియడం లేదు.
మొదట ఎంతోకొంత పవన్ కి జడిసి, హడావిడిగా ప్యాకేజి విషయాన్ని కాకినాడసభ సమయంలో ప్రవేశపెట్టిన కేంద్రం, ఇప్పుడు పవర్ స్టార్ ని అంతాగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు ప్రవర్తిస్తొంది.
పైగా సభ జరిగిన కొద్దిరోజులకే, బిజేపి నాయకులు గానీ, టీడిపి నాయకులుగానీ పవన్ కు వ్యతిరేఖంగా ఎడాపెడా స్టేట్ మెంట్లు ఇవ్వడం తరచూ జరుగుతోంది.
నిన్న వెంకయ్యనాయుడు కూడా ' సుగర్ వ్యాధి ' వున్నవాళ్ళే లడ్డు రుచి తెలుసుకోలేరు అని పవన్ కళ్యాణ్ణి వుద్దేశించి వ్యంగ్యంగా తిరుపతి లో వ్యాఖ్యానించారు.
కొందరు అనుకుంటున్నట్టు పవన్ కూడా ప్యాకేజి విషయంలో రాజీపడ్డాడా? ఇందుకోసం తెరవెనుక మంతనాలు, కూల్ చేసే ప్రయత్నాలు జరిగాయా? అనేది తెలియడం లేదు.
ఏది ఏమైనా పవర్ స్టార్ ఒట్టి ఆరంభశూరిడిగా మిగిలిపోతాడా? ప్రతిపక్షాల అభిప్రాయం ప్రకారం ఆవేశమేగానీ ఆచరణ ఉండదనే మాటలకు రుజువుగా నిలుస్తాడా అనేది త్వరలో తెలుస్తుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి