google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ప్రభాస్ సాధించాడు

2, అక్టోబర్ 2016, ఆదివారం

ప్రభాస్ సాధించాడు



మెగాస్టార్లు, సూపర్ స్టార్లూ పొందలేని ఘనతను బాహుబలి సాధించాడు!

బ్యాంకాక్ లోని ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపుబొమ్మ కొలువుతీరనుంది.!

అక్టోబర్ 5న ప్రభాస్ అభిమానులకు చెబుతానన్న స్వీట్ న్యూస్ ఇదేనని దర్శకుడు రాజమౌళి తెలియజేసాడు.

ఈమధ్య కాలంలో ప్రధాని నరెంద్రమోడి తర్వాత ఈ ఘనతను సాధించిన భారతీయుడు ప్రభాసే కావడం విశేషం. కొద్దిరొజులక్రితం టుస్సాడ్ బౄందం హైదరాబాద్  వచ్చి, ప్రభాస్ కి సంభంధించిన 350 పైగా కొలతల్ని తీసుకువెళ్ళారు.

 దక్షిణ భారతదేశపువ్యక్తి టుస్సాడ్ ఖ్యాతి పొందడం ఇదే మొదటిసారి.  బాహుబలి ప్రపంచవ్యాప్తంగా విజయం పొందడంతో, కథానాయకుడు ప్రభాస్ కు ఈ గుర్తింపు లభించింది.

కాగా, గాంధీ, ఇందిర, సచిన్ లాంటి గొప్ప వ్యక్తుల సరసన ప్రభాస్ మైనపు విగ్రహం పెట్టడం పట్ల అప్పుడే కొంత పెదవి విరుపులు మొదలయ్యాయి. కేవలం బాహుబలి విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రభాస్ కు ఈ ఘనతను ఆపాదించడం పట్ల, కొందరు సినిమా ప్రముఖులు పెదవి విరుస్తున్నట్టు తెలిసింది.

వచ్చే సంవత్సరం మార్చి నెలలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని మ్యూజియం ప్రతినిధి తెలియజేసారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి